Newsనందమూరి బిడ్డా మజాకా.. రష్మిక చేత ఆ విషయాని బయట పెట్టించిన...

నందమూరి బిడ్డా మజాకా.. రష్మిక చేత ఆ విషయాని బయట పెట్టించిన బాలయ్య..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా హోస్ట్ చేస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . తాజాగా మూడో సీజన్ సైతం ప్రారంభమైంది . అన్ స్టాప బుల్ సీజన్ 3 కు గెస్ట్లుగా రణ్బీర్ కపూర్ – రష్మిక మందన్నా- సందీప్ రెడ్డి వంగ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో సైతం రిలీజ్ చేశారు మేకర్స్ . అంతేకాదు రన్బీర్ కపూర్ గురించి భారీ ఇంట్రడక్షన్ ఇచ్చి ఓ రేంజ్ లో హైప్ పెంచేశాడు బాలయ్య .

అంతేకాదు రష్మిక తో స్టెప్పులు వేస్తూ ఆమెను ఇన్వైట్ చేశారు. అంతే కాదు ఆమెను సరదాగా ప్రశ్నలు వేసి ఆమెను సరదాగా ప్రశ్నలు అడిగి నాటిగా అల్లరి చేశాడు బాలయ్య . ప్రోమో అంత కూడా ఫుల్ సరదాగా సాగిపోయింది . అంతేకాదు ఈ ప్రోమోలో రష్మిక తో విజయ్ దేవరకొండ గురించి కూడా టాపిక్ తీసుకువచ్చాడు బాలయ్య. విజయ్ కి రష్మిక చేత కాల్ చేయించారు . విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే “వాట్సప్ రే” అంటూ క్యూట్ గా చాలా రొమాంటిక్గా అన్నాడు .

దీంతో అక్కడ షోలో ఉన్న ఆడియన్స్ అందరూ ఓ రేంజ్ లో అరవగా రష్మిక సిగ్గు పడిపోయింది . ఈ క్రేజీ హింట్ దేనికి సంకేతమో కూడా మనకు తెలిసిందే. గత కొంతకాలంగా వీళ్లు ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పుడు ఈ వీడియోతో ఫైనల్ ని అది కన్ఫామ్ అయిపోయింది . అంతేకాదు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ విజయ్ తో మాట్లాడుతుంటే “మీ హీరోకి చెప్పు ఐ లవ్ రష్మిక ” అని అన్నారు బాలయ్య . ఆ తర్వాత సందీప్..విజయ్ .. రష్మిక మాట్లాడుతుంటే మేడ మీద పార్టీలు ఏంటన్నా అని బాలయ్య ..విజయ్ దేవరకొండ అని అడిగాడు . దీంతో మరోసారి రష్మిక సిగ్గుతో నవ్వేసింది . మొత్తానికి ఎంతోమంది రష్మిక విజయ్ ల మేటర్ ని బయట పెట్టడానికి ట్రై చేసిన ఎవరికీ సాధ్యం కానిది ఫైనల్లీ సాధించేసాడు బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news