Moviesఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఈ శార్వరి ఎవరో తెలుసా..?...

ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఈ శార్వరి ఎవరో తెలుసా..? కళ్ళు చెదిరే బ్యాక్ గ్రౌండ్..!!

సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా అయిపోయిన తర్వాత తారక్ బాలీవుడ్లో కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . వార్ 2 సినిమా ద్వారా ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే వార్ 2 సినిమాల్లో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ శర్వారీ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కించుకునింది అంటే ఈ బ్యూటీ నిజంగానే పెద్ద తోపు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈమెకు సంబంధించిన డీటెయిల్స్ ను వైరల్ చేస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో శర్వారీకి సంబంధించిన డీటెయిల్స్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి .

ఎన్టీఆర్ తో త్వరలోనే స్క్రీన్ షేర్ చేసుకోబోయే శర్వారి గతంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోను పనిచేశారు . అంతకుముందు మోడలింగ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు, బంటి అవుర్ బబ్లీ 2 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు వార్ 2 కూడా ఆమె ఖాతాలో చేరిపోయింది . ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది అంటే అమ్మడు నిజంగానే అదృష్టవంతురాలు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news