Newsఅమ్మ దొంగ.. ఈసారి బిగ్ బాస్ కంత్రీ ప్లాన్.. హౌస్ నుండి...

అమ్మ దొంగ.. ఈసారి బిగ్ బాస్ కంత్రీ ప్లాన్.. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

బిగ్బాస్ సీజన్ సెవెన్ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది . ఎప్పుడు .. ఏం జరుగుతుందో.. ఎవరు

ఎలిమినేట్ అవుతారో .. ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.. చెప్పలేని సిచువేషన్ నెలకొంటుంది . అయితే ఎప్పటిలానే బిగ్ బాస్ తనకు ఇష్టమైన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఇష్టం లేని వాళ్లను బయటకు పంపడానికి ఎలిమినేట్ చేసేస్తున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

కాగా ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాగా సోషల్ మీడియా పోల్స్ ఆధారంగా డేంజర్ జోన్ లో రతిక ఉన్నట్లు తెలుస్తుంది . ఈ వారం నామినేషన్ లో శివాజీ , రైతుబిడ్డ తప్పిస్తే మిగతా అందరూ నామినేట్ అయ్యారు . కాగా అందరూ టాప్ మోస్ట్ ఓటింగ్ తెచ్చుకున్నారు . కానీ రతిక – శోభ – అశ్విని డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది .

అయితే ఈ ముగ్గురు హౌస్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురి వల్ల టిఆర్పి పెరుగుతుంది. మరి ఇలాంటి ముగ్గురులో ఒకరిని బయటకు పంపించేస్తే బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ దెబ్బతింటుంది అన్న కారణంతో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేసాడట. ఈ వారం అసలు ఎలిమినేషన్ ఎత్తేసాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే ముందు నుంచి ఈ ముగ్గురికి బాగా సపోర్ట్ చేస్తున్న బిగ్ బాస్ వాళ్ళను కాపాడుకునే ప్రయత్నంలోనే ఎలిమినేషన్ ఎత్తేశాడు అని ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మండిపడుతున్నారు . చూద్దాం మరి బిగ్ బాస్ ఈ విషయంలో ఎలాంటి ఉల్టా పల్టా డెసిషన్ తీసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news