Newsకళ్యాణ్ రామ్ హ్యాండ్ ప‌డిన జూనియ‌ర్ అనుష్క అడ్ర‌స్ ఎక్క‌డ‌...?

కళ్యాణ్ రామ్ హ్యాండ్ ప‌డిన జూనియ‌ర్ అనుష్క అడ్ర‌స్ ఎక్క‌డ‌…?

ఆషికా రంగనాథ్‌ అచ్చం అనుష్క శెట్టి మాదిరిగానే ఉంటుందని ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమిగోస్ సినిమా చూసి అందరూ మాట్లాడుకున్నారు. ఆషిక హీరోయిన్‌గా తెలుగు కంటే ముందు కన్నడ, తమిళ భాషా చిత్రాలలో నటించింది. 2016 లో వచ్చిన క్రేజీ బాయ్, (2018)లో వచ్చిన రాంబో 2 సినిమాలతో బాగానే పాపులర్ అయింది. అలా నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ నటించగా 2023 లో విడుదల అయిన చిత్రం అమిగోస్‌ మూవీతో తెలుగుతెరకు పరిచయమయింది.

అద్భుతమైన ఫిజిక్..మంచి అందం..గ్లామర్ పాత్రలకి నో చెప్పదు. ఎక్స్‌ఫోజింగ్ బాగా చేస్తుంది..ఇలాంటి మాటలు ఆషిక విషయంలో వినిపించాయి. అమిగోస్ సినిమాలో ఆషిక తన పర్ఫార్మెన్స్ తో అందరినీ బాగానే ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా బాలయ్య నటించిన ధర్మ క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటను అమిగోస్ మూవీలో రీమిక్స్ చేశారు. ఈ పాటలో ఆషిక అందం గురించే అందరూ మాట్లాడుకున్నారు.

అమిగోస్ పోస్టర్స్ చూసి అందరూ ఇండస్ట్రీకి మరో అనుష్క దొరికిందని చెప్పుకున్నారు. అనుష్క ఇండస్ట్రీలో దాదాపు 17 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. ఆషిక తంగనాథ్ కూడా కనీసం ఓ 10 ఏళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలబడుతుందని చెప్పుకున్నారు. కానీ, అమిగోస్ యావరేజ్ సక్సెస్ కావడం వల్లనో ఏమో గానీ, మళ్ళీ ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ రాలేదు.

ఇక్కడ అందం కంటే మేకర్స్ కి దగ్గరవడం చాలా ముఖ్యం. మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా పక్కన పెట్టేస్తారు. అదే హిట్ అయితే, శ్రీలీల మాదిరిగా చెలరేగిపోతారు. అదీ కాకపోతే కొన్ని సక్సెస్ లు వచ్చే వరకూ స్టార్ హీరోలతో దర్శకనిర్మాతలతో తిరుగుతుండాలి. ఆషికలో ఇవన్నీ లేనట్టే. అందుకే, మళ్ళీ అవకాశం దక్కలేదని ఈ జూనియర్ అనుష్క గురించి మాట్లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news