Newsచంద్ర‌మోహ‌న్ కూతురు కూడా స్టార్ హీరోయిన్‌... ఎవ‌రో తెలుసా...!

చంద్ర‌మోహ‌న్ కూతురు కూడా స్టార్ హీరోయిన్‌… ఎవ‌రో తెలుసా…!

చంద్రమోహన్ టాలీవుడ్ లో 1970 సుమయంలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 100కు పైగా సినిమాలలో హీరోగా నటించారు. ఆయన కెరీర్లో మొత్తం 900 కు పైగా సినిమాలలో నటించారు. ఆయన పక్కన హీరోయిన్గా ఎవరైనా చేస్తే వాళ్లు ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్లు కావడం పక్కా అనే సెంటిమెంట్ ఒకప్పుడు టాలీవుడ్ లో ఉండేది.

అందుకు తగ్గట్టుగానే జయప్రద, జయసుధ, శ్రీదేవి ఇలా ఎంతోమంది హీరోయిన్లు చంద్రమోహన్ పక్కన నటించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా తిరిగిలేని స్టార్ హీరోయిన్లు అయిపోయారు. చంద్రమోహన్ కు ఇద్దరు కుమార్తెలు ఒకానొక సందర్భంలో సీనియర్ నటిమణి భానుమతి.. చంద్రమోహన్ ఇద్దరు కుమార్తెలు బాగుంటారు.. మీ పిల్లలు ఇద్దరినీ చైల్డ్ ఆర్టిస్టులుగా చేయమని కూడా అడిగారట. అయితే చంద్రమోహన్ మాత్రం ఆ ప్రతిపాదన తిరస్కరించారు. నటుడుగా బిజీగా ఉన్న రోజుల్లో నాకు పిల్లలతో గడిపే సమయం ఉండేదే కాద‌ని చెప్పారు.

నాలా వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం.. నాలా కష్టపడ‌టం వద్దనే ఉద్దేశంతో వాళ్లను పెంచానని చంద్రమోహన్ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇద్దరు కుమార్తెలు బాగా చదివి గోల్డ్ మెడల్స్ అందుకుని మంచి ఉద్యోగాలు సాధించారు. అయితే చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రం కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సప్తప‌ది సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. చంద్రమోహన్ తమ్ముడు కుమార్తె పేరు సబిత. ఈ సినిమా తర్వాత సబితకు అనేక ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే వాటిని సబిత‌ సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత సబిత‌ వివాహం చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. క్లాసికల్ డ్యాన్సర్ అయిన సబిత‌ ఓ ఈవెంట్లో డ్యాన్స్ చేస్తుండగా ఆ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకుడు కే విశ్వ‌నాధ్‌ తన సినిమాలో నటించమని అడగటం.. పైగా ఆయన చంద్రమోహన్ కుటుంబానికి బంధువు కావడంతో చంద్రమోహన్ కూడా అది మంచి పాత్ర కావడంతో ఆ సినిమా చేయమని సబితను ఒప్పించారు. అయితే ఆ సినిమా తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో నటించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news