Newsజూ ఎన్టీఆర్ తో చంద్ర మోహన్ కి ఉన్న స్పెషల్ బంధం...

జూ ఎన్టీఆర్ తో చంద్ర మోహన్ కి ఉన్న స్పెషల్ బంధం ఇదే.. తండ్రి-కొడుకులకి మించి..!

సినిమా ఇండస్ట్రీకి నేడు బ్లాక్ డే అని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే మరణించారు . గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు . ఈ ఊహించని పరిణామంతో తెలుగు ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి

గురైపోయింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోలు సీనియర్ హీరోలు హీరోయిన్లు కూడా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మెసేజెస్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో ఆయనకు ఉన్న స్పెషల్ బంధం గురించి బయటపడింది .

జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రమోహన్ కు చాలా చాలా ఇష్టం . అంతేకాదు ఆయనకు కొడుకులు లేరు అన్న లోటు జూనియర్ ఎన్టీఆర్ తీర్చేశారు అని ..ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే స్పెషల్ ఇష్టంగల చంద్రమోహన్ ఆయనతో పలు సినిమాలో నటించి మెప్పించారు. రాఖి ,బాద్షా సినిమాలలో వీళ్ళ మధ్య నటన మరింత బాగా పండింది . అంతేకాదు హరికృష్ణ ఎన్టీఆర్ ను ఏ విధంగా చూసుకునే వారో.. అంతలానే చంద్రమోహన్ కూడా ఎన్టీఆర్ ని చూసుకునేవారట . చంద్రమోహన్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news