News' భ‌గ‌వంత్ కేస‌రి ' బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడికి హీరో...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడికి హీరో దొరికేశాడు… మ‌ళ్లీ ఆ హీరోతోనే…!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ దసరాకు బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. కెరీర్‌లో ఫస్ట్ టైం అనిల్ రావిపూడి.. బాలయ్య లాంటి సీనియర్ హీరోను డీల్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇది అనిల్ రావిపూడి కెరీర్ పరంగా ఏడో సూపర్ హిట్ కావడం విశేషం. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మొదలైన అనిల్ రావిపూడి విజ‌య‌ ప్రస్థానం తాజాగా బాలయ్యతో భగవంత్ కేస‌రి సినిమా వరకు నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూ వస్తోంది.

భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేస్తాడు ? ఆయన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఏంటన్నది.. సహజంగానే అందరిలోనూ ఆసక్తితో ఉంది. అయితే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకు హీరో దొరికేశాడు. మాస్ మహారాజ్‌ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల దసరాకు టైగర్ నాగేశ్వరరావు అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చి అలరించారు.

ఈ సంక్రాంతికి ఈగల్ సినిమాతో మరోసారి స్వల్ప వ్యవ‌ధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో అనిల్ రావిపూడి – రవితేజ కాంబినేషన్లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి తర్వాత సినిమా రవితేజతో చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మళ్లీ ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. రాజా ది గ్రేట్ సినిమాకి ఇది సీక్వెల్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news