Moviesవిజ‌య్ VS ' లియో ' బాల‌య్య ' భ‌గ‌వంత్ కేస‌రి...

విజ‌య్ VS ‘ లియో ‘ బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ విన్న‌ర్ ఎవ‌రు ? … పై చేయి ఎవ‌రిదంటే..!

దసరా వీకెండ్ లో భాగంగా ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన లియో, రెండు టాలీవుడ్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. లియో సినిమాకు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం.. ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌.. లోకేష్ కనగరాజ్‌ విక్రమ్, ఖైదీ, మాస్టర్ సినిమాలతో తెలుగులో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

దీనికి తోడు ఈ సినిమాను తెలుగులో సితార సంస్థ అధినేత సూర్యదేవర నాగ వంశీ రిలీజ్ చేయడంతో పాటు భారీ ఎత్తున థియేటర్లు దక్కాయి. ఇక అఖండ , వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ల తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో పాటు ఆరు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో భగవంత్ కేసరిపై కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

సినిమాకు తొలి రోజు సాయంత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది.. ఫైనల్గా ఏ సినిమా పై చేయి సాధించింది.. ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధించారో ? అన్నది చూద్దాం. లియో సినిమా విషయానికి వస్తే.. కథ పెద్దగా లేకపోయినా యాక్షన్ సీన్లతో నింపేశారు. ఎల్సీయూ అభిమానులను కూడా లియో మెప్పించలేదు. నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ అయితే ఎక్కువగా వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత సూపర్ డూపర్ హిట్ సినిమాలు విక్రమ్ , ఖైదీ రేంజ్ లో చివరకు ఆయ‌న వీక్ సినిమా మాస్టర్ రేంజ్ లో కూడా లియో లేదని.. ఆ సినిమా మ్యాజిక్ ఇందులో మిస్ అయిందని అంటున్నారు.

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే.. కామన్ ఆడియన్స్ నుంచి పరవాలేదు.. బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ వినిపిస్తోంది. నందమూరి అభిమానులకి, మాస్ మూవీ లవర్స్ కు, యాక్షన్ మూవీ లవర్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాలో చూపించిన మహిళా సాధికార‌త‌, బాల‌య్య – శ్రీలీల‌ సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు అబౌవ్ యావరేజ్ టాక్ వస్తోంది.

ఫైనల్ గా సినిమాకి అబౌవ్ యావరేజ్ హిట్ టాక్ కి మధ్యలో రెస్పాన్స్ వినిపిస్తోంది. దీనికి తోడు బాలయ్యకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే లియో మూవీ యూత్ యాక్షన్ లవర్స్ కోసం కాగా భగవంత్ కేసరి ఫ్యామిలీ అండ్ కామెడీ ఆడియన్స్ సినిమాగా రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ఎండ్ టైం కి భగవంత్ కేసరి బెటర్ టాక్ సొంతం చేసుకున్నట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news