Moviesఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న త్రివిక్రమ్ కొడుకు.. ఆ స్టార్ హీరో మూవీతోనే..హిట్...

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న త్రివిక్రమ్ కొడుకు.. ఆ స్టార్ హీరో మూవీతోనే..హిట్ కొట్టాడు పో!

ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొడుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . మాస్ – క్లాస్ – యాక్షన్ – ఫ్యామిలీ డ్రామా ఇలా జోనర్ ఏదైనా దానిలో త్రివిక్రమ్ మార్క్ పక్కాగా కనిపిస్తుంది. ఆయన మాటలు తూటాలుల పేలిపోతూ ఉంటాయి . జనాలను బాగా ఆకట్టుకుంటాయి . మరి అలాంటి ఆయన కొడుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటే జనాలు ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తారో మనం ఊహించవచ్చు .

త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య తన కొడుకుని డైరెక్టర్గా పరిచయం చేసేందుకు రంగంలోకి దిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణకు ఆప్తుడు అయిన త్రివిక్రమ్ ఈ బ్యానర్లో చాలా సినిమాలు చేశారు. ఇక ఈ బ్యానర్ లోనే తన కొడుకుని సైతం ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆశపడుతుంది . సాయి సౌజన్య ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ బ్యానర్ లో సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్నాయి .

ఈ సినిమాల కారణంగా త్రివిక్రమ్ భార్య పేరు కూడా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది . ఇలాంటి క్రమంలోనే కుమారుడు రిషి మనోజ్ ను కూడా ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయం చేయబోతున్నారు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమా ద్వారానే రిషి కుమార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ ఎంత జాన్ జిగిడి దోస్తులు అనేది మనకు బాగా తెలిసిందే. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news