Newsటాలీవుడ్‌లో సొట్టబుగ్గల తాప్సీని తొక్కేసిందెవ‌రు... వాళ్ల‌తో కాంప్ర‌మైజ్ కాలేదా..!

టాలీవుడ్‌లో సొట్టబుగ్గల తాప్సీని తొక్కేసిందెవ‌రు… వాళ్ల‌తో కాంప్ర‌మైజ్ కాలేదా..!

సొట్టబుగ్గల సుందరి ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఊపు ఈ మధ్య బాగా తగ్గింది. తెలుగులో హాట్ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయిన తాప్సీ హిట్స్ మాత్రం అంతగా అందుకోలేకపోయింది. చెప్పాలంటే టాలీవుడ్ లో తాప్సీని వాడుకున్న దర్శకులు, హీరోలు బాగానే ఉన్నారట. ఆ మాట అప్పట్లో ఆమె చేసిన సంచల వ్యాఖ్యలతోనే అర్థం అయింది. అవకాశం ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్ర రావు లాంటి వారినే ఏకిపారేసింది.

ఇక మంచు హీరోల గురించి మంచిగా మాట్లాడినా, మిగతా హీరోల గురించి పొగిడినా లోలోపల మాత్రం తాప్సీతో రాత్రిళ్ళు గడిపిన వారు ఉన్నారట. ఇది దాదాపు అందరి హీరోయిన్స్ విషయంలో జరుగుతుందనీ చెప్పుకుంటుంటారు. కంచం, మంచం పంచుకుంటేనే తోడు ఉండే మేకర్స్, హీరోలు పబ్లిక్ ఫంక్షన్స్ లో తమ హీరోయిన్ మంచి పర్ఫార్మర్ అని పొగడ్తలతో ముంచేస్తారు. లేదంటే ప్రభాస్, పూజా హెగ్డే మాదిరిగా పక్క పక్కన కూర్చుకున్నా ఎడమొహం పెడమొహం తో ఉంటారు.

అయితే, తాప్సీ తెలుగులో ఒకటి అరా హిట్స్ అందుకున్న తర్వాత నెగ్గుకురాలేకపోయింది. అందుకే బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. అక్కడి జనాలకి తాప్సీ బాగా నచ్చింది. జుడ్వా 2 లాంటి సినిమాలో బికినీ వేసి హాట్ బీట్ పెంచినా ఆ తర్వాత పింక్, బద్లా లాంటి అద్భుతమైన కథలను ఎంచుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. తెలుగు కంటే బాలీవుడ్ లో హీరోయిన్స్ ని వాడే విధానం కాస్త మెరుగ్గా ఉంటుందని చెప్పుకుంటుంటారు. అందుకే, హీరోయిన్స్ ఇక్కడ కాస్త క్రేజ్ రాగానే బాలీవుడ్ చెక్కేస్తారు.

అయితే, మన తెలుగులో నమ్మకంగా ఉంటే హీరోలు, దర్శకులు చాలా బాగా చూసుకుంటారు. హీరోలే అవకాశాలు ఇప్పిస్తుంటారు. తాప్సీ కూడా బాలీవుడ్ లో కాస్త క్రేజ్ రాగానే ఇక్కడ వాళ్ళపైన ఫైర్ అయింది. అదే సమయంలో నిర్మాతగా కూడా మారడంతో ఇంకాస్త తల‌ పొగరు చూపించింది. అలా కాకుండా కాస్త కాంప్రమైజ్ అయితే తెలుగులో సీనియర్ హీరోల పక్కన మంచి ఛాన్సులు వచ్చేసి. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే వెంకటేశ్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్ తో నటించింది. బాలీవుడ్ లో ఫేం రాగానే హీరోయిన్ గా పరిచయం చేసిన వారిని ఇండస్ట్రీని కామెంట్స్ చేసి ఇప్పుడు దూరమైపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news