Newsఎన్టీఆర్‌తో ' ఐర‌న్‌మ్యాన్ ' లాంటి సినిమా ఫిక్స్ చేసిన స్టార్...

ఎన్టీఆర్‌తో ‘ ఐర‌న్‌మ్యాన్ ‘ లాంటి సినిమా ఫిక్స్ చేసిన స్టార్ ప్రొడ్యుస‌ర్‌..!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్‌ ఇండియా సినిమా దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చివరి సినిమా ఆర్ఆర్ఆర్‌ తో గ్లోబల్ ఫేమ్ తెచ్చుకోగా తాను నెక్ట్స్‌ ఒక క్రేజీ లైన్ అప్‌ను సెట్ చేసుకున్నాడు. ఈ భారీ లైన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా ఉంది.

దేవర 1, దేవర 2, ప్రశాంత్ నీల్‌ సినిమా.. అటు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. గతంలో త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సూపర్ డూపర్ హిట్ అయింది. అటు త్రివిక్రమ్, ఇటు ఎన్టీఆర్‌కు యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ బాగా కావాల్సిన వ్య‌క్తి. తాజాగా నాగ‌వంశీ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్ గా మారాయి.

తారక్ అన్న లో ఒక రకమైన కామెడీ టైమింగ్ ఉంటుంది. అలాంటి కామెడీతో ఒక సూపర్ హీరో చిత్రం.. ఐరన్ మ్యాన్ లాంటి లైన‌ప్ తో తనకు సినిమా చేయాలని ఉందని.. తాను కచ్చితంగా ఆ తరహా గ్రాండ్ సినిమాను నిర్మిస్తానని నాగవంశీ తెలిపారు. అయితే నాగవంశి- ఎన్టీఆర్ తో తెరకెక్కించే ఈ ఐరన్ మ్యాన్ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అవుతాడన్న చ‌ర్చ‌ కూడా అప్పుడే మొదలైంది.

వాస్తవంగా దేవర సినిమాకు ముందే ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా పట్టాలు ఎక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కాగా.. కొరటాలతో దేవర సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజీ లైన‌ప్‌లో త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news