Newsపూజా హెగ్డే కొత్త కారు రేటు అన్ని కోట్లా... క‌ళ్లు బైర్లు...

పూజా హెగ్డే కొత్త కారు రేటు అన్ని కోట్లా… క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..!

కెరీర్ పరంగా పూజ హెగ్డే చాలా కష్టాల్లో ఉంది. ఇటీవల నటించిన సినిమాలేవి హిట్లు అవలేదు. ప్రభాస్‌ నటించిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌, మెగాస్టార్‌ చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసిన నటించిన ఆచార్య డిజాస్టర్లు అయ్యాయి. తమిళ స్టార్ హీరో విజయ్‌తో జత కట్టిన బీస్ట్ అట్టర్ ప్లాప్. హిందీలో సల్మాన్ ఖాన్ తో చేసిన కీసిక భాయ్ కిసికి జాన్ పెద్ద డిజాస్టర్. ఇలా నాలుగు సినిమాలు భారీ డిజాస్టర్లు అవడంతో అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ ఈ బుట్ట బొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఒకప్పుడు తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చేవారు. మహేష్ బాబు గుంటూరు కారం – పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలలో ముందుగా ఆమె హీరోయిన్. ఆ తర్వాత ఆమెను రకరకాల కారణాలతో తప్పించేశారు. ఈ రెండు సినిమాలు చేజారిపోవడం పూజా హెగ్డే కెరీర్ కు పెద్ద ఎదురుదెబ్బ. ప్రస్తుతానికి ఆమె బాలీవుడ్ మీద ఆశ‌లు పెట్టుకుంది. షాహిద్ కపూర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

కెరీర్ పరంగా కొంత గ్యాప్ రావడంతో ఆ సమయాన్ని తన పర్సనల్ లైఫ్‌న‌కు ఎక్కువ కేటాయించింది. ఇటీవల మాల్దీవులు ట్రిప్ కు వెళ్లిన పూజ అక్కడే తన బర్త్‌డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త కారును కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా రేంజ్ రోవర్ ఎస్‌వి, ఎస్‌యువి కారును పూజ కొనుగోలు చేసింది. ప్రస్తుతం పూజ కొత్త కారు ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి.

అవి చూసిన నెటిజన్లు ఆ కారు ధర ఎంత ? అనేది గూగుల్లో బాగా సెర్చ్ చేసి చూస్తున్నారు. పూజకొన్న కొత్త కారు రేటు దాదాపు నాలుగు కోట్లు పైమాటే అని తెలుస్తోంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లు. పూజకు మామూలుగానే కార్లు కొనటం ఇష్టం. ఇప్ప‌టికే ఆమె గ్యారేజ్‌లో ఆడీ క్యూ-7, జాగ్వార్ సెడాన్‌, ఫోర్సే క‌యోన్‌, బీఎండ‌బ్ల్యూ 5 సీరిస్ లాంటి లగ్జరీకారులు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news