Newsబాలీవుడ్ లో నెక్స్ట్ బలైపోయే తెలుగు హీరోయిన్ ఈమె.. జీవితం సంకనాకి...

బాలీవుడ్ లో నెక్స్ట్ బలైపోయే తెలుగు హీరోయిన్ ఈమె.. జీవితం సంకనాకి పోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదల అనేది కచ్చితంగా చూసుకుంటారు స్టార్ హీరోలు హీరోయిన్లు . స్టార్ హీరోలు ఒకే ఇండస్ట్రీలో ఎక్కువగా ఎదగడానికి చూస్తే హీరోయిన్లు మాత్రం అన్ని భాషలలో వేలు పెడుతూ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకోవడానికి చూస్తున్నారు . ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ తెలుగులో అవకాశాలు దక్కించుకొని పాపులారిటీ సంపాదించుకొని తద్వారా వచ్చిన అవకాశాలతో బాలీవుడ్లోకి వెళ్లి తెలుగు ఇండస్ట్రీ నే మరిచిపోతున్నారు . ఆ లిస్టులోకే వస్తారు ఇలియానా – తాప్సి- రకుల్ ప్రీత్ సింగ్ -తమన్నా – కీర్తి సురేష్- ఇలియానా .

ఇలియానా: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న ఇలియానా బాలీవుడ్ పై మోజుతో అక్కడికి వెళ్లి ఎన్ని ఇబ్బందులు పడిందో మనం చూసాం. ఆఖరికి చేతులో ఒక్క సినిమా లేకుండా అల్లాడి పోయే స్థాయిలో కూడా ఇలియానా కొట్టుమిట్టాడింది . ఇప్పుడు కూడా ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలోనే ఆమె బోల్డ్ సీన్స్ లో నటించడం ఆమె కెరియర్ కు మైనస్ గా మారింది .

తాప్సి : తెలుగులో ఝుమ్మంది నాదం లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది . హగ్గులు – ముద్దులు – బెడ్ సీన్స్ అంటూ రెచ్చిపోయింది . ఇప్పుడు ఆమెను ఆ రేంజ్ పాత్రలకే చూస్తున్నారు తప్పిస్తే మిగతా పాత్రలకు చూడడం లేదు .

రకుల్ ప్రీత్ సింగ్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో పద్ధతి గల హీరోయిన్గా పేరు సంపాదించి బాలీవుడ్ కి వెళ్ళాక బరితెగించిన హీరోయిన్గా ట్యాగ్ చేయించుకొని మరి ట్రోలింగ్కి గురవుతుంది . దానికి కారణం ఆమె చేసిన కొన్ని సినిమాలోని సీన్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

తమన్నా : మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా తెలుగులో ఎక్స్పోజింగ్ చేసింది . కానీ బాలీవుడ్ లో మాత్రం బలితెగించేసింది. జీ కర్దా వెబ్ సిరీస్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇలా చేసి తమన్న తనకున్న పేరుని చెడగొట్టుకునేసింది .

రష్మిక : తెలుగు ఇండస్ట్రీలో చాలా పద్ధతి గల హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది . రీసెంట్గా రిలీజ్ అయిన అనిమల్ సినిమా పాటలో రష్మిక ఎలా లిప్ లాక్ ఇచ్చిందో చూసాం . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లల్లో రష్మిక ఒక్క సినిమాలో ఇన్ని లిప్ లాక్ ఇవ్వడం ఇదే తొలిసారి .

కీర్తి సురేష్ : మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . దీంతో కీర్తి సురేష్ సైతం అలాంటి బోల్డ్ రోల్స్ చేస్తుందని ..అది బాలీవుడ్ గాలి అని.. ఇక కీర్తి సురేష్ కూడా అలాంటి పాత్రలకే పనికి వస్తుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news