NewsNBK 109 స్టోరీ లీక్‌.. సెకండాఫ్‌లో థియేట‌ర్ల‌లో కేక‌లు.. అరుపులే... !

NBK 109 స్టోరీ లీక్‌.. సెకండాఫ్‌లో థియేట‌ర్ల‌లో కేక‌లు.. అరుపులే… !

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భ‌గ‌వంత్ కేస‌రి సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న తెర‌కెక్కుతోంది. అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు సూప‌ర్ హిట్ల‌తో బాల‌య్య ఈ సినిమాతో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ హిట్లు కొడ‌తాడ‌న్న కాన్ఫిడెంట్ ఉంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 109వ సినిమా కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.

సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. బాబి – బాల‌య్య కాంబినేష‌న్ అన‌గానే ఊర‌మ‌స్ కాంబినేష‌న్‌. ఈ కాంబినేష‌న్లో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

బాల‌కృష్ణ పాత్ర‌తో పాటు యాక్ష‌న్ అంశాలు ఏ రేంజ్లో ఉండ‌బోతున్నాయో మ్యాడ్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చెప్పేశాడు. గుంటూరు కారం త‌ర్వాత మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమా ఇది.. ఇటీవ‌ల కాలంలో అస్స‌లు ట‌చ్ చేయ‌ని గెట‌ప్ ఇది.. క్యార‌క్ట‌రైజేష‌న్తో బాల‌య్య పాత్ర చాలా కొత్త‌గా.. కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలిపారు.

ఇక సెకండాఫ్లో 45 నిమిషాల పాటు వ‌చ్చే యాక్ష‌న్ బ్లాక్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని కూడా హింట్ ఇచ్చేశాడు. బోయ‌పాటి శీను కూడా త‌న సినిమాల్లో ట‌చ్ చేయ‌ని యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను చాలా కొత్త‌గా సాగుతాయ‌ని కూడా వంశీ చెప్పారు. మాస్ హిస్టీరియ ఉన్న హీరో అలాగే మాస్ డైరెక్ట‌ర్ క‌లిసి చేసే ఈ సినిమాను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తార‌ని నాగ‌వంశీ ధీమా వ్య‌క్తం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news