News"తప్పు నాదే..సారీ"..ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి బహిరంగ క్షమాపణలు..ఏమైందంటే..?

“తప్పు నాదే..సారీ”..ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి బహిరంగ క్షమాపణలు..ఏమైందంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బహిరంగ క్షమాపణలు చెప్పారు .అలా చేయడం మా తప్పే క్షమించండి అంటూ ఓపెన్ గా ఇప్పుడు సారీ చెప్పడం సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే సినిమాను ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే . ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయింది . మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

కాగా సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు . ఇలాంటి క్రమంలోని ఓ రివ్యూర్పై మండిపడ్డారు . “శ్రీ లీల ఈ సినిమాలో డాన్స్ చేయలేదు అని అసహనం వ్యక్తం చేశాడు ఆ రివ్యూవర్.. ఆయన ఎవరో కూడా నాకు తెలుసు.. ఒక ఫోబియాతో బాధపడుతూ ఆర్మీలో చేరడం లక్ష్యంగా కష్టపడే అమ్మాయిగా శ్రీ లీలా ఈ పాత్రను డిజైన్ చేశాం .కానీ ఆయన ఆ పాత్ర నుండి డ్యాన్స్ ఆశించాడు ..సినిమా చూసే దృష్టి కోణం అంత దారుణంగా ఉంది” అంటూ ఫైర్ అయ్యారు .

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్..” మీరు సినిమాలో మిస్టేక్ చేశారు.. శరత్ కుమార్ సినిమాలో జైలర్ ..కానీ బ్రేకింగ్ న్యూస్ లో సిఐ మరణం అని స్క్రోలింగ్ వేశారు “అంటూ ప్రశ్నించారు . అయితే అనిల్ రావిపూడి సైతం ఈ తప్పును యాక్సెప్ట్ చేశారు . “అంత పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం నిజంగా గ్రేట్.. నిజంగా అది మా తప్పే సారీ అంటూ పబ్లిక్ గా ఆయనకు క్షమాపణలు చెప్పారు”. దీంతో అంత పెద్ద డైరెక్టర్ ఆయనకు క్షమాపణలు చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news