Newsయూఎస్‌లో రికార్డుల దుమ్ము రేపుతోన్న ' లియో ' .. ఇంత...

యూఎస్‌లో రికార్డుల దుమ్ము రేపుతోన్న ‘ లియో ‘ .. ఇంత క్రేజ్ ఏంది సామీ..!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య‌ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా త్రిష హీరోయిన్గా దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్ తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా లియో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న విజయ్ నటించిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. విజయ్‌కు బాగా లక్కీ హీరోయిన్ అయిన త్రిష చాలా ఏళ్ల తర్వాత విజయ్‌తో జోడి కట్టింది. విక్రమ్‌ లాంటి సెన్సేష‌న‌ల్‌ హిట్ సినిమా తర్వాత లోకేష్ కనగ‌రాజు డైరెక్ట్ చేసిన సినిమా ఇది.

దసరా కానుకగా ఈనెల 19న లియో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు బాలయ్య భగవంత్‌ కేసరి – రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాల నుంచి గట్టి పోటీ ఉంది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. విచిత్రం ఏమిటంటే ట్రైలర్ కూడా రాకముందే లియో యూఎస్ ప్రీమియర్స్ సేల్స్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. ట్రైలర్ కూడా రాకుండానే తమిళంతో పాటు తెలుగు ఫ్రీ సీల్స్ కూడా హాఫ్ మిలియన్ మార్క్ దాటిపోయాయి.

ఓ తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు అది కూడా రిలీజ్ కు రెండు వారాల ముందే హాఫ్ మిలియన్ మార్క్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. లియోపై ఉన్న హైప్‌ ఏ రేంజ్ లో ? ఉందో ఈ ప్రీమియర్ వసూళ్లు చెబుతున్నాయి. రిలీజ్ టైం నాటికి ఒక తెలుగు వెర్షన్ లోనే వన్ మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు ఇదే ధీమాతో ఉన్నాయి.

ఈ భారీ బడ్జెట్ సినిమాకి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. 7 స్క్రీన్ సినిమాస్ నిర్మాణం వహిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విజయం ఢీకొట్టే విలన్ గా కనిపించనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news