Moviesలియో ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు అన్ని కోట్లా... విజ‌య్...

లియో ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు అన్ని కోట్లా… విజ‌య్ బాక్సాఫీస్ ఊచ‌కోత‌…!

నిన్న ప్రపంచ వ్యాప్తంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ – లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్లో తరకెక్కిన లియో సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎబో యావ‌రేజ్ టాక్ వచ్చింది. అయితే సినిమాపై ముందు నుంచి కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. లియో తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర దున్నేసింది. లియో తాజా అప్డేట్ ప్రకారం లియో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రు. 140 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసినట్టు చెబుతున్నారు.

ఇది విజయ్ కెరీర్ లోనే సాలిడ్ ఓపెనింగ్స్‌గా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్రిష – ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ – సౌత్ సీనియర్ హీరో అర్జున్ విలన్లుగా నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించాడు. తెలుగులోనూ ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కినట్టు తెలుస్తోంది.

తొలి రోజు రు. 15 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు వచ్చినట్టు సమాచారం. తెలుగులో తొలి రోజు షేర్ ఏకంగా రు. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏరియా వైజ్‌గా ఫ‌స్ట్ డే వ‌సూళ్ల లెక్క‌ల‌ను కొద్ది సేప‌ట్లో బ‌య‌య‌ట‌కు రానున్నాయి. ఏది ఏమైనా విజయ్ లియో తొలిరోజు బాక్సాఫీస్ ను ఊచకోత కోసేసిందనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news