Newsనాగార్జునకు జోడీగా క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌.. ఎవ‌రా భామ... ఏంటా సినిమా...!

నాగార్జునకు జోడీగా క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌.. ఎవ‌రా భామ… ఏంటా సినిమా…!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకవైపు బిగ్గెస్ట్ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తూ మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాను యువ దర్శకుడు విజయ్ బిన్నీతో చేయడానికి రెడీ అయిపోయాడు. నా సామిరంగా టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయ్యింది.

ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాక నా సామిరంగా సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఈ సినిమాలో నాగార్జున కి జోడిగా పలువురు హీరోయిన్ల పేర్ల‌ను పరిశీలించిన మేకర్లు ఫైనల్ గా కన్నడ భామ ఆషిక రంగనాథ్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఆషిక రంగనాథ్ ఎవరో ? కాదు.. ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమీగోస్ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడిగా నటించింది . అలాగే ఈ సినిమాలో ఆషీకా రంగనాథ్ తో పాటు మరో హీరోయిన్ రోల్ కూడా ఉంటుందని.. అందుకోసం మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో టీం బిజీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చక చక పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news