Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' సినిమాలో కాజ‌ల్ ' కాత్యాయ‌ని '...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ సినిమాలో కాజ‌ల్ ‘ కాత్యాయ‌ని ‘ పాత్ర ఎంత సేపంటే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్‌ కేసరి దసరా కానుకగా ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో కనిపిస్తోంది. పెళ్లి తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ భగవంత్‌ కేసరి సినిమాలో కీలక పాత్రతో రీయంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో కాజల్ ది మధ్య వయసు ఉన్న అమ్మాయి పాత్ర అని తెలుస్తోంది.

గతంలో బాలయ్యకు జోడిగా రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా అప్పుడు బిజీగా ఉండడంతో కాజల్ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ఇప్పుడు బాలయ్యకు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కాత్యాయని పాత్రలో కనిపిస్తోంది. ఇక కాజల్ పాత్ర సెకండాఫ్‌లో వస్తుందని.. సెకండ్ హాఫ్ మొత్తం కాజల్ కాత్యాయని పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుందని తెలుస్తోంది.

ఇక సినిమాలో బాలయ్యకు… కాజల్‌కు మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు ఉండనున్నాయి. అయితే ఈ ప్రేమ సన్నివేశాలు కూడా కాస్త ఫన్నీగా ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పారు. కాజల్ – బాలయ్య మధ్య డ్యూయ‌ట్లు, పాటలు ఉండవు. ఈ ఇద్దరు పాత్రల మధ్య ఎంతో అనుబంధం ఎంతో మెచ్యూరిటీతో కథ ఉంటుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news