Newsసె... గా ఉండాలంటే బాడీతో పాటు అది కూడా ఉండాలి.. అషురెడ్డి...

సె… గా ఉండాలంటే బాడీతో పాటు అది కూడా ఉండాలి.. అషురెడ్డి బోల్డ్ ర‌చ్చ‌…!

బుల్లితెర నటి అషు రెడ్డికి సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ముందుగా జబర్దస్త్ షో తో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఆ తర్వాత బిగ్‌బాస్ షో లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక రాంగోపాల్ వర్మ – అషురెడ్డి ఇంటర్వ్యూ లతో ఆమె ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

అశురెడ్డి బోల్డ్‌గా కనిపించడమే కాదు బోల్డ్ కామెంట్ చేస్తూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఆమె బోల్డ్ కామెంట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. సె…గా ఉండటం అనేది కేవలం బాడీతో మాత్రమే డిసైడ్ చేయలేము.. అది మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుందని రాసుకుంది. ప్రస్తుతం విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో పిచ్చపిచ్చగా క్రేజ్‌ పెంచుకుంటుంది.

కెరీర్ పరంగా చూస్తే కొన్ని వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తున్న అశురెడ్డి అవకాశం దొరికితే చాలు వెండితెరపై హీరోయిన్గా అందాలు ఆరబోయడానికి రెడీ అన్నట్టుగా సంకేతాలు పంపుతుంది. ఈ అమ్మడు సినిమా అవకాశాలు ద‌క్కించుకుని సినిమా హీరోయిన్ అవ్వాలన్న కోరికతోనే హాట్‌ ఫోటోలు షూట్ చేస్తూ ఉంటుంది. మ‌రి అషురెడ్డి సినిమా వాళ్ల కంట్లో ఎప్పుడు ప‌డుతుందో ? ఆమెకు సినిమా హీరోయిన్ ఛాన్సులు ఎప్పుడు వ‌స్తాయో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news