Newsఆర్జీవీ అమ్మాయిలను వాడుకుంటారనేది నిజమే.. ఈ హీరోయిన్ చెప్పిన ప‌చ్చి నిజాలు...!

ఆర్జీవీ అమ్మాయిలను వాడుకుంటారనేది నిజమే.. ఈ హీరోయిన్ చెప్పిన ప‌చ్చి నిజాలు…!

టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో దర్శకుడిగా అసాధారణమైన క్రేజ్ సంపాదించుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆర్జీవీ సినిమా అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు. టెక్నీషియన్స్ ఇప్పటి వరకూ ఎంత మంది బయటకి వచ్చారో లెక్కే లేదు. ఒకప్పుడు ఆర్జీవీ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడు అతను చేసే ట్వీట్స్ కోసం, ఇచ్చే ఇంటర్వ్యూల కోసం అంతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ట్వీట్స్ చేస్తూ, సినిమాలు చేస్తూ ఓ కార్యకర్తలా పనిచేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిందే. వ్యూహం అనే సినిమా రూపొందిస్తున్న ఆర్జీవీ దానికి కొనసాగింపుగా మరో రెండు సినిమాలను తీస్తున్నారు. ఇటీవలే ఆర్జీవీ డెన్ ని ప్రారంభించిన ఆర్జీవీ వెబ్ సైట్ పెట్టి ఇప్పటికే 25 చిత్రాలను ప్రీ ప్రొడక్షన్ లో పెట్టారు.

అయితే, అమ్మాయిలతో ఆర్జీవీ చేసే పిచ్చి చేష్టలు అందరికీ చిర్రెత్తిస్తున్నాయి. అదంతా ఇంతకాలం షో ఆఫ్ అనుకున్నారు. అరియానా ఇప్పుడు ఈ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుందంటే దానికి కారణం ఆర్జీవీ. అషురెడ్డి కూడా ఇంత పాపులర్ అవడానికి కారణం ఆయనే. ఇప్పుడు చీర మీద సినిమా తీస్తానని చెప్పుకొస్తున్నారు. యూట్యూబ్ లో అమ్మాయిని చూసి తీసుకున్న నిర్ణయం ఇది.

ఇలాంటివన్నీ ఆర్జీవీకే సాధ్యం అవుతాయి. అయితే, నటి గాయత్రి గుప్తా ఇటీవల ఆర్జీవీ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనని వాడుకున్నాడని వాపోయింది. పెద్ద సినిమాలో ఛాన్స్ ఇస్తానన్న ఆర్జీవీ అసలు ఎవరూ గుర్తించని రోల్ ఇచ్చారని చాలా కాలం నన్ను మభ్యపెట్టి వాడుకున్నారని బాధపడింది. ఇలా ఆర్జీవీ మీద ఓపెన్ గా కామెంట్స్ చేసిన అమ్మాయి అంటే ఇప్పటి వరకూ గాయత్రి గుప్తా మాత్రమే. దీనిని బట్టి ఆర్జీవీ నిజంగా అమ్మాయిలను వాడుకుంటారని గతంలో ఆయన చెప్పిన మాటలను బట్టి కూడా అర్థమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news