Newsమ‌హేష్ ' గుంటూరు కారం ' లో అన‌సూయ రోల్ లీక్‌......

మ‌హేష్ ‘ గుంటూరు కారం ‘ లో అన‌సూయ రోల్ లీక్‌… వామ్మో ఆంటీని ఆడేసుకుంటారు…!

హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇటు బుల్లితెరపై సందడి తగ్గించేసింది. వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్.. ఫ‌ట్ అనే విషయం పక్కన పెడితే నటిగా మాత్రం తనను తాను నిరూపించుకుంటుంది. ఆమెకు మంచి పాత్రలు.. మంచి సినిమాలు పడుతున్నాయి. రంగస్థలం సినిమాలో అనసూయత్త‌ పాత్ర తర్వాత ఆమెకు వెండితెరపై కూడా మంచి క్రేజ్ వచ్చింది.

కథా బలంతో పాటు.. పాత్ర బలం ఉన్న పాత్రలకు అనసూయను ఎంపిక చేసుకుంటున్నారు తెలుగు దర్శకులు. తాజాగా ఆమె మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో అనసూయ కీ రోల్‌ పోషించబోతుంది. ఇది కూడా ఆంటీ పాత్రలో అని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుందని కూడా తెలుస్తుంది.

తాజాగా అనసూయ మహేష్ బాబుతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అనసూయను ఎవరైనా బయట ఆంటీ అంటే రెచ్చిపోతూ వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో అనసూయ ఆంటీ పాత్ర చేస్తే ఇక నెటిజన్లు ఆమెను ఎలా ? ఆటాడుకుంటారో చెప్పక్కర్లేదు.

మరి దీనికి అనసూయ నుంచి ఎలాంటి రిటాక్ట్‌ ఉంటుందో చూడాలి. ఏదేమైనా అనసూయను ఆంటీగా త్రివిక్రమ్ ఒక రేంజ్ లో చూపించబోతున్నారని క్లారిటీ అయితే వచ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news