Newsసినిమాల్లోకి రాక‌ముందు స‌మంత‌ను చూస్తారా... ఇలా ఉందేంట్రా బాబు ( వీడియో)..!

సినిమాల్లోకి రాక‌ముందు స‌మంత‌ను చూస్తారా… ఇలా ఉందేంట్రా బాబు ( వీడియో)..!

ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న చెన్నై బ్యూటీ సమంత సినిమాల్లోకి రాకముందు చిన్న చిన్న ప్రకటనలు చేస్తూ ఉండేది. ఆమె చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లోనే కొన్ని వాణిజ్య సంస్థలకు ప్రకటనలు చేసి పాపులర్ అయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. కేరళలో పుట్టిన సమంత తల్లిదండ్రుల ఉద్యోగి రిత్య చెన్నైలో స్థిరపడడంతో ఆమె చదువంత చెన్నైలోనే జరిగింది.

సమంత చదువుకుంటున్న రోజుల్లోనే నటన మీద ఇష్టంతో కాలేజీలో పలు కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొనేదంట. దీంతో ఆమె సినిమాలోకి రాకముందే చాలా వాణిజ్య ప్రకటనలో నటించింది. కెరీర్ ప్రారంభంలో సమంత తమిళనాడుకు చెందిన ఆశిక జ్యువెలరీకి సంబంధించిన వస్తువులను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. సమంత స్క్రీన్ మీద కనిపించిన మొదటి ప్రకటన కూడ ఇదే కావటం విశేషం.

ఇంకా చెప్పాలంటే సమంత నటన అనేది ఈ ప్రకటన నుంచే ప్రారంభమైంది. ఈ ప్రకటనలో నటించినందుకు గాను సమంతకు ఆ రోజుల్లోనే రూ .5000 పారితోషకం ఇచ్చారట. సమంత నటించిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు ఆ ప్రకటనలో చూసిన సమంతను ఇప్పుడు సమంతను చూస్తే అస్సలు గుర్తుపట్టలేం.

ఇంకా చెప్పాలంటే అసలు ఆమె సమంతేనా అన్న సందేహం వచ్చేలా ఉంది. అయితే సమంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టే ఇలా అందంగా మారిందని.. అందుకే ఈరోజు స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుందని చెప్పవచ్చు ..ఇక ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స తీసుకుంటూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news