Moviesటైగర్ నాగేశ్వరరావుకి-రంగస్ధలం సినిమాతో ఉన్న లింక్ ఏంటో తెలుసా..హిట్ కొట్టావ్ రా...

టైగర్ నాగేశ్వరరావుకి-రంగస్ధలం సినిమాతో ఉన్న లింక్ ఏంటో తెలుసా..హిట్ కొట్టావ్ రా రవితేజ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు . ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు రవితేజ . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన అన్ని లుక్స్ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ సినిమా ఈ నెల 20వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

అయితే ఈ సినిమాకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ సినిమా రన్ టైం ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే సిచువేషన్ ఫేస్ చేసింది రంగస్థలం సినిమా . ఈ సినిమా మూడు గంటలు ఉన్నా కూడా ప్రేక్షకులు ఏమాత్రం బోర్ గా ఫీల్ అవ్వకుండా ఆసక్తికరంగా డైరెక్ట్ చేశాడు సుకుమార్ .

అయితే ఇంచుమించు టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా మూడు గంటల టైం వస్తుందట. అయితే ఈ సినిమా ఎంతవరకు జనాలను మెప్పిస్తుంది ..? అంతసేపు థియేటర్స్ లో జనాలు కూర్చొని ఈ సినిమాను చూస్తారా ..?అనేది ప్రశ్నార్థకంగా మారింది . అంతేకాదు సినిమాను కట్ చేయాలన్న ఎక్కడ ఏ సీన్ కట్ చేసిన.. అది సినిమాకి లాసే అవుతుంది ..అందుకే డైరెక్టర్ కి సైతం అర్థం కావడం లేదట . ఒకవేళ రంగస్థలం స్ట్రాటజీ సక్సెస్ అయితే మాత్రం..ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు .. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news