News' దేవ‌ర‌ '.. ఎన్టీఆర్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోన్న కొర‌టాల‌.. ఏం చేశాడో...

‘ దేవ‌ర‌ ‘.. ఎన్టీఆర్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోన్న కొర‌టాల‌.. ఏం చేశాడో చూడండి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ హీరోయిన్గా… దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ ఇండియా సినిమా దేవర ఎన్టీఆర్ గ్లోబల్ హిట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న దేవర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాపై నేషనల్ ఆడియెన్స్‌తో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కొర‌టాల‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏడాదిన్నర టైం తీసుకున్నారు. దీనిని బట్టి దేవర కోసం కొరటాల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుస్తోంది. ఈ సినిమాని కొరటాల టీం లార్జ‌ర్‌దెన్ లైఫ్ స్కేల్లో తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ చేసేందుకు కొరటాల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ముద్దుగా జాన్వీక‌పూర్‌ను హీరోయిన్గా తీసుకోగా.. ఎన్టీఆర్ ను కొట్టే విలన్‌గా బాలీవుడ్ కండలు వీరుడు సైఫ్ ఆలీఖాన్‌ను తీసుకున్నారు.

అలాగే మరో బాలీవుడ్ హీరో కూడా సినిమా సెకండ్ హాఫ్ లో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల ఎన్టీఆర్ ని బాగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్యాప్ లేకుండా కంటిన్యూగా దేవర షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల కోసం పది రోజులు పాటు లాంగ్ షెడ్యూల్ వేసినట్టు తెలుస్తోంది.

ఈ పది రోజులు కేవలం ఎన్టీఆర్ మీద సీన్లు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు ఏ మాత్రం రెస్ట్ లేకుండా కొరటాల సినిమాను ముందుకు నడిపిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. దేవర రెండు పార్టులుగా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news