Newsమెగా గ్యాప్‌.. బ‌న్నీ - చ‌ర‌ణ్ మ‌ధ్య మాట‌ల్లేవ్‌.. మాట్లాడుకోవ‌టాల్లేవ్‌.. ఇదే...

మెగా గ్యాప్‌.. బ‌న్నీ – చ‌ర‌ణ్ మ‌ధ్య మాట‌ల్లేవ్‌.. మాట్లాడుకోవ‌టాల్లేవ్‌.. ఇదే సాక్ష్యం…?

మెగా ఫ్యామిలీలో ఇటు మెగాస్టార్ కుటుంబానికి.. అటు అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రామ్ చరణ్ – బన్నీ మధ్య ఇటు వృత్తిపరమైన పోటీ వ్యక్తిగతంగా కూడా మారిపోయింది అన్న గుసగుసలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. ఇక వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి సంగతేమో గాని.. వీళ్ళ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మెగా కాంపౌండ్ నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో ఫోటో ఒక్కో సందేహానికి దారితీస్తోంది.

మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ – రామ్ చరణ్ మధ్య ఏమాత్రం పొసగటం లేదు అన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. మొన్నటికీ మొన్న చిరంజీవి తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు.. కాబోయే భార్య భర్తల్ని తన ఇంటికి ఆహ్వానించి మెగా సభ్యులందరితో భారీ గెట్ టు గెద‌ర్‌ ఏర్పాటు చేశారు. కొణిదెల ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములు.. అక్క చెల్లెలు అందరూ దీనికి హాజరయ్యారు.. ఇద్దరు మాత్రం రాలేదు వాళ్లే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదనుకోవచ్చు. అయితే ఊళ్లోనే ఉండి తీరిక చేసుకునే వెసులబాటు ఉండి కూడా బన్నీ ఈ వేడుకకు రాలేదు. ఏది ఏమైనా ఈ వేడుకలో బన్నీ కనిపించలేదు. కట్ చేస్తే ఈసారి స్వయంగా బన్నీ దంపతులు పార్టీ ఇచ్చారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిని త‌మ‌ ఇంటికి ఆహ్వానించారు. మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు నితిన్ – రీతు వర్మ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కానీ ఈ సెలబ్రేషన్స్‌లో రాంచరణ్ కనిపించలేదు. దీంతో మెగా అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య ఏమాత్రం పొస‌గటం లేదని టాలీవుడ్ లో చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది. ఆస్కార్ వచ్చినప్పుడు బన్నీ వేసిన ట్వీట్.. దానికి రిటార్టుగా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు చరణ వేసిన ట్వీట్ చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో రగడ ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ.. అతడి ఫంక్షన్లో ఇతడు.. ఇతడి ఫంక్షన్ లో అతడు మిస్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news