News' భ‌గ‌వంత్ కేస‌రి ' కి ' లియో ' ట్ర‌బుల్‌......

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ కి ‘ లియో ‘ ట్ర‌బుల్‌… బాల‌య్య గ‌ట్టిగా గ‌ర్జించాల్సిందే…!

దసరా కానుకగా బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు – తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలు పోటీలో ఉన్నాయి. మామూలుగా అయితే బాలయ్యకు పెద్ద పోటీ లేనట్టే లెక్క. అయితే ఇప్పుడా సీన్‌ లేదు. లియో సినిమాను పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండేది కాదేమో..! ఈ సినిమాకు దర్శకుడు లోకేష్ కనగ‌రాజు విక్రమ్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ఈ సినిమాను సితార సంస్థ రు. 18 కోట్లకు తెలుగు హక్కులు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తుంది. రేపు రిలీజ్ అయ్యాక సినిమా టాక్ ఎలా ఉన్నా ? సినిమా రిలీజ్ ముందు ఈ డబ్బింగ్ సినిమా మిగిలిన‌ రెండు సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది. లియో సినిమాను నైజాంలో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. అలాగే సితార సంస్థతో కలిసి జర్నీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ లియోను ఆంధ్రాలో విడుదల చేస్తున్నారు. వీళ్ళు ధియేటర్లు.. మార్కెటింగ్ లో పండిపోయి ఉన్నారు. దీంతో భగవంత్‌ కేసరి సినిమాకు థియేటర్ల విషయంలో కాస్త పోటీ అయితే ఉంటుంది. పైగా ఈ రెండు సినిమాలో ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.

ఈ విషయంలో టైగర్ నాగేశ్వరరావు కొంత వెనుకబడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య సినిమాకు కాస్త ఎక్కువ థియేటర్లు దొరికిన లియోకు కూడా అంచనాలతో పోలిస్తే ఎక్కువ ధియేటర్లు దొరుకుతున్నాయి. ఇటు నైజాంలోనూ అటు ఆంధ్రాలోను అదే పరిస్థితి ఉంది. పెద్ద ప‌ట్టణాలు, ఏ సెంటర్లు.. రెండు థియేటర్లు ఉన్నచోట్ల ఇబ్బంది లేదు. సింగిల్ థియేటర్ ఉన్నచోట బాలయ్య సినిమాకు ప్రయారిటీ ఇస్తారు. అయితే ఏ సెంటర్లలో కూడా లియో కొన్ని మంచి మంచి స్క్రీన్ లలో రిలీజ్ అవుతుంది.

ప్రస్తుతానికి పెద్ద పట్టణాలలో అటు భగవంత్ కేసరికి, ఇటు లియోకు సమానంగానే థియేటర్లు పడుతున్నాయి. అంటే లియో రిలీజ్ వెనక సితార సంస్థతో పాటు పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఉండటమే కారణం. అయితే ఈ విషయంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా అనూహ్యంగా వెనకబడినట్టు కనిపిస్తోంది. అయితే రిలీజ్ అయ్యాక ఆయా సినిమాల టాక్‌ను బ‌ట్టి థియేటర్ల అకౌంట్ అయితే కచ్చితంగా మారుతుందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news