News100 % నిజం: మ‌హేష్‌బాబు - షారుక్ ఖాన్ సినిమా... టైటిల్...

100 % నిజం: మ‌హేష్‌బాబు – షారుక్ ఖాన్ సినిమా… టైటిల్ చూస్తారా..!

అబ్బా ఈ టైటిల్ చూడటానికి చాలా త్రిల్లింగ్ గా ఉంది. నిజంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కలిసి నటిస్తున్నారా ? ఇది నిజమేనా అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే ఇది నూటికి నూరు శాతం నిజం అని తెలుస్తోంది. అయితే ఇందులోనే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుంది.

ఇక షారుక్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే పఠాన్ – జవాన్ లాంటి రెండు వెయ్యి కోట్ల సినిమాలలో నటించాడు. భారతదేశ సినిమా చరిత్రలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. అందులోనూ ఒకే ఏడాది రిలీజ్ అయ్యి 1000 కోట్లు వసూళ్లు కొల్లగొట్టడం అంటే అది మామూలు సంచలనం కాదనే చెప్పాలి. అలాంటి క్రేజీ రికార్డు షారుఖ్ ఖాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. పదేళ్లుగా షారుక్ ఖాన్ పై వస్తున్న విమర్శలకు ఈ ఏడాది వచ్చిన పఠాన్ – జవాన్ సినిమాలతో చెక్ పెట్టేసాడు. ఇప్పుడు నడుస్తోంది అంత షారుక్ ఖాన్ యుగం అని చెప్పాలి.

ఇక గుంటూరు కారం సినిమాలో షారుక్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర క్లైమాక్స్‌కు ముందు 15 నిమిషాల నుంచి మొదలవుతుందట. సెకండాఫ్ డ్రైవ్ మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. ఈ పాత్రలో షారుఖ్ ఖాన్ గెస్ట్ గా కనిపించబోతున్నాడని టాక్. ఈ అనుబంధం కారణంగానే జవాన్ సినిమాకి సపోర్ట్ గా మహేష్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడని అంటున్నారు.

నిజంగానే షారుఖ్ ఖాన్ గుంటూరు కారం సినిమాలో నటిస్తే ఈ సినిమాకు అటు నార్త్‌లో, హిందీ బెల్టులో కచ్చితంగా అదిరిపోయే క్రేజ్ ఉంటుందటంలో సందేహం లేదు. ఇక సెకండ్ హాఫ్ లో మీనాక్షి చౌదరి పాత్ర ఎంటర్ అవుతుందట. సినిమాలో కథ‌ అంత ఆమె చుట్టే తిరుగుతుందని గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడేలా సరికొత్త స్టోరీ ప్లాన్ చేశాడట. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news