Newsబిడ్డ‌కు త‌ల్లి అయ్యి అన్ని ముడ‌త‌లు వ‌చ్చేసినా దానికి రెడీ అంటోన్న...

బిడ్డ‌కు త‌ల్లి అయ్యి అన్ని ముడ‌త‌లు వ‌చ్చేసినా దానికి రెడీ అంటోన్న శ్రీయ‌… !

శ్రియ టాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా తన అందంతో మెరుపులు మెరిపిస్తున్న సీనియర్ హీరోయిన్. 2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. శ్రియది ఢిల్లీ.. అక్కడ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించి ఇష్టం సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 సినిమాతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతోపాటు తమిళ భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు.

తమిళంలో జ‌యం ర‌వి, ధ‌నుష్‌, విజయ్ వంటి హీరోల సరసన నటించిన ఆమె రజినీకాంత్ కి జోడిగా శివాజీ సినిమాలో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోలతోనూ జత కట్టారు. అలాగే హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగుపెట్టారు.

ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు షేర్ చేసే ఫోటోలు చూస్తుంటే శ్రేయ ఇంకా కుర్రాలను క‌వ్విస్తూ కుర్ర హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కువ కాదని చెప్పేందుకు ఉత్సాహపడుతున్నట్టు ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫోటోలు యువతకు మంచికి ఇస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ త్రిష తన రీఎంట్రిలో అదరగొడుతోంది. అలాగే శ్రియ‌కు కూడా ఒక్క మంచి ఛాన్స్ దొరికితే మళ్ళీ 40 ఏళ్ల వయసులోనూ తన అందాలతో రెచ్చిపోవడం ఖాయం అని చెప్పాలి.

చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక మ్యూజిక్ స్కూల్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. గత 22 సంవత్సరాలుగా సినిమా రంగంలో హీరోయిన్గా కొనసాగుతున్న శ్రేయ ఏ మాత్రం తరగని అందాలతో కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బిడ్డకు తల్లి అయినా ఆమె అందాలు.. ఒంపు సొంపులు ముడతలు పడుతున్నా కూడా తనలో హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news