Moviesగుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి..? స్టార్ హీరో అల్లుడు ఇంత...

గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి..? స్టార్ హీరో అల్లుడు ఇంత డేంజరస్ ఫెలోనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని నమ్మడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో కూడా చూస్తున్నాం. కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో స్టార్ హీరో ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ అల్లుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కాగా ఎటువంటి రోల్స్ నైన సరే నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న ఈయన రీసెంట్గా తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నాడు . ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకున్నారు అంటూ తెలుస్తుంది . అయితే మరో విడాకులు తీసుకున్న హీరోయిన్ తో ధనుష్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని.. లేట్ నైట్ కూడా మీట్ అవుతూ ఆమెకు మరింత దగ్గరవుతున్నాడు అని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇద్దరు పిల్లల తండ్రివైన నువ్వు ఇలాంటి పాడు పనులు చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు . అయితే ధనుష్ ఫాన్స్ మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు . మా ధనుష్ అలాంటివాడు కాదని .. పద్ధతికి మరో మారుపేరు అని .. ఇవి కేవలం పుకార్లు అని చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ధనుష్ దీనిపై స్పందించకపోవడంతో ఈ వార్త బహుశా నిజమే కావచ్చు అందుకే ధనుష్ స్పందించట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news