Newsఫైర్‌బ్రాండ్ కంగ‌నా పెళ్లి... డిసెంబ‌ర్లో ఎంగేజ్మెంట్‌... 2024 మార్చిలో పెళ్లి...!

ఫైర్‌బ్రాండ్ కంగ‌నా పెళ్లి… డిసెంబ‌ర్లో ఎంగేజ్మెంట్‌… 2024 మార్చిలో పెళ్లి…!

బాలీవుడ్ నటి కంగనారనౌత్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కంగ‌న పేరు చెప్తేనే బాలీవుడ్ మొత్తం షేక్ అవుతుంది. ఆమె ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తూ ఉంటుంది. అలాగే బాలీవుడ్ లో ఉన్న నెపోటిజంపై చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. శివసేన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్లతో ఢీకొట్టే విషయంలో కంగనా ఎక్కడ వెనక్కు తగ్గలేదు.

తాజాగా ఆమె లారెన్స్ కి జోడిగా చంద్రముఖి 2 సినిమాలో నటించగా.. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక కంగనా కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ కలిసి కొంతకాలం ఉన్నారు. కంగంగను పెళ్లి చేసుకునేందుకు హృతిక్ తన భార్య సుసానేకు విడాకులు ఇచ్చాడని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ బ్రేకప్ చెప్పేసుకున్నారు.

ఆ తర్వాత కంగ‌న హృతిక్ ను చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే కంగనా పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్ర‌ముఖ కాంట్ర‌వ‌ర్సీ సినీ విశ్లేష‌కుడు కె.ఆర్ కమల్‌ఖాన్ కంగ‌న‌ పెళ్లి గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే కంగనా ప్రముఖ బిజినెస్మెన్‌ను పెళ్లి చేసుకోబోతుందని పోస్ట్ చేశాడు.

ఆ బిజినెస్మెన్ కు ముంబైలో కోట్లాది రూపాయల వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. వీరిద్దరు డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకుని… వచ్చేయేడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకుంటారని… అడ్వాన్స్‌గా హ్యాపీ వెడ్డింగ్ డే కంగనాజీ అంటూ కే ఆర్ కే ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు. గతంలో కూడా కె ఆర్ కె బాలీవుడ్ సెలబ్రిటీలపై చేసిన కామెంట్లు కాంట్రవర్సీగా మారాయి. మరి ఇప్పుడు దీనిపై కంగ‌నా ఎలా ? రియాక్ట్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news