Newsన‌య‌న‌తార - విఘ్నేష్ క‌వ‌ల పిల్ల‌ల ఫ‌స్ట్ బ‌ర్త్ డే ఫోటోలు.....

న‌య‌న‌తార – విఘ్నేష్ క‌వ‌ల పిల్ల‌ల ఫ‌స్ట్ బ‌ర్త్ డే ఫోటోలు.. ఇంత క్యూట్‌గానా..!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార – స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివ‌న్‌ మూడేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. నయనతార సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్. ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. విగ్నేష్ శివ‌న్‌ చిన్న డైరెక్టర్. పైగా న‌య‌న్‌తో పోలిస్తే వయసులో ఏడాది చిన్నోడు.. అయినా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది.

ఇక ఈ దంపతులకు గత ఏడాది ఇద్ద‌రు ట్విన్స్‌ పుట్టారు. ఉయిర్ – ఉలగం అనే కుమారులు పుట్టారు. తాజాగా వీరిద్దరి మొదటి బర్త్ డే వేడుకలు మలేషియాలోని ప్రసిద్ధ ట్విన్ టవర్స్ ముందు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరు తమ ఇద్దరు పిల్లలు తమ జీవితాల్లోకి ఆనందాన్ని తీసుకువచ్చారంటూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు. తాము ఈ మూమెంట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రసిద్ధ టవర్స్ ముందు తమ పిల్లలను భుజానికి ఎత్తుకొని ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటున్నట్టుగా జంటగా ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌లో కవల పిల్లలు ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. న‌య‌న‌తార‌ వైట్ అండ్ వైట్ వేసుకుని చాలా స్టైలిష్ లుక్ లో తన పిల్లలను ఎత్తుకుంది.

తాను స్పెట్స్ పెట్టుకోవ‌డంతో పాటు పిల్ల‌ల‌కు కూడా స్పెట్స్ పెట్టి మ‌రీ పోజులు ఇచ్చింది. అలాగే మ‌రో ఫొటోలో తన పిల్లలకు ఆహారం తినిపిస్తోంది. ఇక న‌య‌నైన్ – విగ్నేష్ సరోగసి ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news