Newsశ్రీలీలతో ఈ టాలీవుడ్ హీరోలు త‌ట్టుకోలేక‌పోతున్నారా... అంత ఇబ్బంది పెడుతోందా...!

శ్రీలీలతో ఈ టాలీవుడ్ హీరోలు త‌ట్టుకోలేక‌పోతున్నారా… అంత ఇబ్బంది పెడుతోందా…!

శ్రీలీల‌ ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో ఎలా మార్మోగుతుందో చూస్తూనే ఉన్నాము. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందD సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది శ్రీలీల‌. ఆమె తెలుగు అమ్మాయే.. ఆమె స్వస్థలం ఏపీలోని విజయవాడ. అయితే ఆమె కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయింది. మొదటి సినిమాతోనే తన అందచందాలతో తెలుగు సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. దీంతో ఈ మెకు వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలతో కలిసి ఏకంగా తొమ్మిది సినిమాలలో నటిస్తోంది. అన్ని సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు శ్రీలీల క్రేజ్‌తో పాటు ఆమె రెమ్యూనరేషన్ కూడా సినిమా సినిమాకు పెరిగిపోతూ వస్తోంది. పెళ్లి సందడి సినిమాకు ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్ 10 లక్షలు మాత్రమే..! తర్వాత రవితేజ ధమాకాకు 50 లక్షలు ఇచ్చారు.

ఇప్పుడు రామ్ సరసన నటించిన స్కంద సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఆమె ప్రస్తుతం నటిస్తున్న ఒక్కో సినిమాకు ఏకంగా మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. సినిమాలు మాత్రమే కాదు అటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తూ భారీగా పారితోషకాలు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం శ్రీలీల‌ రామ్ స్కంద – బాలయ్య భగవంత్‌ కేసరి – పంజా వైష్ణవ్‌తో ఆది కేశవ్ – నితిన్తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ – మహేష్ బాబు గుంటూరు కారం – పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ – విజయ్ దేవరకొండ సినిమాలోను – అనగనగా ఒక రోజు సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం శ్రీలీల ఒక్కో సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండడంతో ఆమె మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో నటించడం కష్టంగా కనిపిస్తోంది. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు ఒక రేంజ్ లో బడ్జెట్ పెడుతున్నారు. శ్రీలీల ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తూ ఉండడంతో నిర్మాతలు ఆమెను తీసుకోవాలంటే వెనకా ముందు ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీలీలకు పెరిగిన క్రేజ్‌తో ఆమె ఇక స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే అందుబాటులో ఉండేలా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news