Moviesదూకుడు + గ‌బ్బ‌ర్‌సింగ్ మిక్స్ చేసి తీసిన వెంక‌టేష్ డిజాస్ట‌ర్ సినిమా…!

దూకుడు + గ‌బ్బ‌ర్‌సింగ్ మిక్స్ చేసి తీసిన వెంక‌టేష్ డిజాస్ట‌ర్ సినిమా…!

మెహర్ రమేష్ ఎంత గొప్ప డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెహర్ రమేష్ పేరు చెబితేనే టాలీవుడ్ గజగజ వనికి పోతుంది. బిల్లా – కంత్రి – శక్తి – షాడో లాంటి డిజాస్టర్ సినిమాలతో హరి వీర భయంకరమైన డిజాస్టర్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ పేరు తెచ్చుకున్నాడు. విక్టరీ వెంకటేష్ తో తీసిన షాడో సినిమా తర్వాత పదేళ్లపాటు అసలు మెహర్ రమేష్‌ను ఏ టాలీవుడ్ ? హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు.

అలాంటి టైంలో బంధుత్వాన్ని ఉపయోగించుకుని మెగాస్టార్ చిరంజీవికి దగ్గర భోళాశంకర్ సినిమా డైరెక్టర్ చేసే ఛాన్స్ కొట్టేశారు. గత శుక్రవారం ప్రేక్షకుల‌ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయిన ఆచార్య సినిమాను మించిన డిజాస్టర్ గా భోళాశంకర్ అతి చెత్త రికార్డు చిరంజీవి ఖాతాలో వేసింది.

ఇక మెహర్ రమేష్ విక్టరీ వెంకటేష్ తో తీసిన పెద్ద డిజాస్టర్ షాడో. ఈ సినిమా దెబ్బతో సింహా లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన పరుచూరి కిరీటి ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా పోయారు. ఇక షాడో సినిమా మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాకు.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సినిమాకు కాపీ అన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. దూకుడు సినిమాలో తన తండ్రిని చంపిన వాళ్లపై రివేంజ్ తీర్చుకునే క్రమంలో మహేష్ బాబు ఒక్కో విల‌న్‌ను చంపుకుంటూ పోతాడు.

షాడో సినిమాలో కూడా తన తండ్రి నాగబాబుని చంపిన విల‌న్ల‌ను అంతముంచేందుకు వెంకటేష్ ఒక్కొక్కడిని చంపుకుంటూ వెళతారు. ఇక పవన్ కళ్యాణ్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ సినిమాలో చాలా సీన్లను.. కామెడీ, అత్యక్షరి కూడా మెహర్ రమేష్ షాడో సినిమా కోసం కాపీ కొట్టినట్టుగా కనిపిస్తుంది. అలా దూకుడు + గబ్బర్ సింగ్ సినిమాలో సీన్లను కాపీ కొట్టి అటుకులు.. బొతుకులు వేసి షాడో సినిమా తీస్తే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక మెహర్ రమేష్ బిల్లా తాజాగా తీసిన భోళా శంకర్ రెండు సినిమాలు కూడా రీమేకులే. ఇక డైరెక్ట్ గా తీసిన కంత్రి – శక్తి రెండు అతిపెద్ద డిజాస్టర్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news