Moviesగాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీన్స్ తో అదరకొట్టిన వరుణ్.....

గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీన్స్ తో అదరకొట్టిన వరుణ్.. మరో హిట్ పక్కా(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా ట్యాగ్ ఉపయోగించుకొని వచ్చిన హీరోలలో వన్ ఆఫ్ ద హీరో వరుణ్ తేజ్ .మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “గాండీవధారి అర్జున” . ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అప్పటినుంచి డిఫరెంట్ కధలని ఎంచుకుంటూ వస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాంధీవదారి అర్జున అనే సినిమాను చూస్ చేసుకున్నాడు .

ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ – టీజర్ – పాటలు హైలెట్గా నిలిచాయి . అయితే రీసెంట్ గా కొద్దిసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో సస్పెన్స్గా క్రేజీ క్రేజీ మలుపులతో కట్ చేశాడు ప్రవీణ్ . ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. మొత్తం యాక్షన్ సీక్వెన్స్లతో అదిరిపోయింది .

అంతేకాదు యాక్షన్ సీన్స్ ..ఆ కార్ చేజింగ్లు చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయి లాగా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు మనం వరుణ్ తేజ్ ని చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్స్ లోనే చూశాం.. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు యాక్షన్ డేంజర్ జోన్ ని టచ్ చేసారు. అతగాడి గెటప్.. మాటలు.. డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సాక్షి వైధ్య హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ గా తెలుస్తుంది . ఓ స్పై ఆఫిసర్ లా మనకు వరుణ్ కనిపించబోతున్నాడు. అయితే మెగా హీరోలు అంటే కచ్చితంగా నాటీ డైలాగ్స్, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . అయితే వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమాలో అలాంటివి ఏమీ టచ్ చేయకుండా ..పెద్ద రిస్కే చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో గాండీవధారి అర్జున ట్రైలర్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news