Movies"నా కెరీర్ లో చేసిన పరమ చెత్త మూవీ అదే.."..పేరుతో సహా...

“నా కెరీర్ లో చేసిన పరమ చెత్త మూవీ అదే..”..పేరుతో సహా బయటపెట్టిన తమన్నా.. స్టార్ హీరో పరువు పాయే..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక కథను ఒప్పుకుంటున్నప్పుడు హీరో హీరోయిన్ .. ఆ సినిమా హిట్ అవ్వాలని .. తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు . కానీ ప్రతి సినిమా హిట్ అవ్వాలన్న రూల్ లేదు .. నమ్మకము లేదు .. అయితే సినిమా ఇండస్ట్రీలో కొందరు ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో నటించిన సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి . అయితే అలా తమకు ఫ్లాప్ ఇచ్చిన సినిమాను డైరెక్ట్ గా చెప్పడం చాలా కష్టం . చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు.

ప్రజెంట్ తమన్నా అలాంటి కామెంట్స్ చేసే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తమన్నా ప్రెసెంట్ కోలీవ్డ్ స్టార్ హీరో రజనీకాంత్ సరసన “జైలర్” అనే సినిమాలో నటించింది . ఆగస్టు 10న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్న మాట్లాడుతూ ..”తాను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇష్టంగానే చేసినవని ..కానీ ఓ సినిమా విషయంలో మాత్రం తన నటన ఇప్పటికీ తనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదని ” చెప్పుకొచ్చింది .

ఆ సినిమా మరేదో కాదు హీరో విజయ్ దళపతితో నటించిన “సుర”. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే కధా..కంటెంట్ ప్రకారం ప్లాప్ అయింది . అయితే ఈ సినిమాలో తమన్నా నటన ఆమెకి నచ్చలేదట. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . “కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . చేసిన తర్వాత ఆ పని గురించి బాధ పడకూడదు.. అయిపోయింది అయిపోయిందనే అనుకోవాలి ప్రజెంట్ నేను అలాంటి ఫీలింగ్ లోనే ఈ సినిమాను వదిలేసాను ” అంటూ చెప్పుకొచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news