Movies"భోళా శంకర్"ని చిరంజీవితోనే చెయ్యమని బలవంతం చేసిన స్టార్ హీరో.. తెర...

“భోళా శంకర్”ని చిరంజీవితోనే చెయ్యమని బలవంతం చేసిన స్టార్ హీరో.. తెర వెనుక ఇలా కూడా కూడా జరుగుతున్నాయా..?

టాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ..ప్రజెంట్ ఎంతో ఇష్టంగా ..ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భోళా శంకర్ . మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు . వేదాళం సినిమాకి రీమిక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . వేదాళం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడక్కడ చేంజెస్ చేసి తెలుగులో కొన్ని మసాలాలు దట్టించి ..మెగా అభిమానులకు ఎలా కావాలో అలా తెరకెక్కిస్తున్నాడు మెహర్ రమేష్ .

ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ తమన్నా.. చిరంజీవికి జోడిగా నటిస్తూ ఉండగా.. కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలు పాత్ర లో నటిస్తుంది . కీర్తి సురేష్ భర్తగా యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్టు 6వ తేదీ గ్రాండ్గా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే భోళా శంకర్ సినిమాని మిస్ చేసుకున్న హీరో పేరు వైరల్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు మెగా హీరో పవన్ కళ్యాణ్ .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాని రీమేక్ చేయాలని పవన్ అనుకుంటున్నారట . కానీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాను హోల్డ్ లో పెడుతూ వచ్చారు. ఫైనల్లీ ఆ అవకాశం మెహర్ రమేష్ చేతికి చేరింది . అయితే పవన్ ఎంతో ఇష్టంగా ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడని.. ఆయన వద్దకు వెళ్లి మిగతా డీటెయిల్స్ గురించి చర్చించగా పవన్ బిజీగా ఉన్నాను అని అన్నయ్యతో ఈ సినిమా చేయండి అంటూ సజీషన్ ఇచ్చారట. అదే విధంగా ఆయన సజెషన్ ని తూచా తప్పకుండా పాటించాడు మెహర్ రమేష్. ఏ మాటకు ఆ మాట ఈ పాత్రకు పవన్ కళ్యాణ్ కన్నా చిరంజీవినే బాగా సూట్ అయ్యారు అంటున్నారు మెగా ఫాన్స్ . అలా పవన్ చేయకుండా ఈ సినిమా చిరంజీవి చేసేలా చేసి పవన్.. మెగా అభిమానులకు మరింత ఫేవరేట్ హీరోగా మారిపోయాడు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news