Moviesకీర్తి సురేష్‌తో చిరంజీవి కామ‌వేషాలు.. చిలిపి ప‌నులు… శ్రీ రెడ్డి బూ…తులు

కీర్తి సురేష్‌తో చిరంజీవి కామ‌వేషాలు.. చిలిపి ప‌నులు… శ్రీ రెడ్డి బూ…తులు

తరచూ అనవసర వివాదాలలో తల దురుస్తూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్ గా మారిపోయింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ జనాలకు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేదు. తనకు నచ్చని వారిపై.. నచ్చని సినిమా హీరోలపై ఏదో ఒక రకంగా వల్గర్ కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిరుస్తూ ఉండటం ఆమెకు అలవాటుగా మారింది. ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసే శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎంత దారుణంగా కామెంట్స్ చేస్తుందో చెప్పక్కర్లేదు.

తాజాగా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటించారు. ఈ నెల 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ కీర్తి సురేష్ తో చిరు కాస్త క్లోజ్ గానే బిహేవ్ చేశారు. ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ నటించింది. దీనిపై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది.

సినిమాలో చెల్లెలు పాత్ర.. నిజజీవితంలో తన కూతురు వయసు ఉన్న కీర్తి సురేష్ తో లక్షల మంది ప్రజల ముందు ఆ చిలిపి పనులు.. కామ వేషాలు ఏంటి ? చిరంజీవి గారు.. కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగేది అంటూ ట్విట్ చేసింది. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అటు మెగా అభిమానులు అయితే శ్రీ రెడ్డిని మీకు అసలు బుద్ధి ఉందా.. అంద‌రూ నీలాంటి బుద్ధితోనే ఆలోచిస్తారా అంటూ ఘాటుగా రెచ్చిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news