Movies"స్క్రీన్ ముందు ఒకలా..తెర వెనుక మరొకలా".. తమన్నా నిజ స్వరూపం బయటపెట్టిన...

“స్క్రీన్ ముందు ఒకలా..తెర వెనుక మరొకలా”.. తమన్నా నిజ స్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భోళా శంకర్ . ఈ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కి కీర్తి సురేష్ – చిరంజీవి హైలెట్గా నిలిచారు . అంతేకాదు శ్రీముఖి సైతం ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది . ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి – తమన్నా యొక్క గొప్పతనం గురించి ఆమె సినిమాలపై పాషినేట్ గా ఉంటుంది అన్నదానిపై ఓ ఉదాహరణ చెప్పాడు . ఈ సినిమా చేస్తున్న టైంలో మిల్కీ బ్యూటీ తమన్న వాళ్ళ నాన్నగారికి ఓ సర్జరీ అయ్యిందట. ఈ క్రమంలోనే సినిమాలో మిల్కీ బ్యూటీ అనే సాంగ్ స్విజర్లాండ్ లో షూట్ చేయడానికి స్విజర్లాండ్ వెళ్లారట భోళా శంకర్ టీం .

అయితే దాదాపు రెండు వారాలు పాటు అక్కడే ఈ సాంగ్ చిత్రీకరణ జరిగిందట . ఈ సాంగ్ షూటింగ్ టైం రోజున తమన్నా వాళ్ళ నాన్నగారికి సర్జరీ అయ్యిందట. “అయితే తమన్నా భాదను ఎక్కడ కూడా తెరపై చూపించకుండా ఆ బాధను తనలోనే ఉంచుకొని మేకప్ వేసుకొని షాట్ రెడీ అనగానే వచ్చి ..యాక్షన్ అనగానే నవ్వుతూ తనతో స్టెప్స్ వేసింది . కట్ అని చెప్పగానే వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ నాన్న గారి ఆరోగ్యం గురించి కనుక్కుంది అని.. ఆమెకు సినిమాలపై అంత ప్యాషినేట్ గా ఉంటుందని.. అంత డెడికేషన్ గా వర్క్ చేయడం వల్ల ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉంది అంటూ “చిరంజీవి చెప్పుకొచ్చారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి తమన్నా ని ఓ రేంజ్ లో పొగిడేసారు . అంటే ఆమెలో ఎంత టాలెంట్ ఉందో ఆమె ఎంత డెడికేషన్ గల వ్యక్తితో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news