Moviesఆ హీరోయిన్లు అంద‌రూ ప‌క్క‌లోకి వెళుతున్నారు.. సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద సంచ‌ల‌నం..!

ఆ హీరోయిన్లు అంద‌రూ ప‌క్క‌లోకి వెళుతున్నారు.. సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద సంచ‌ల‌నం..!

టాలీవుడ్ లో అచ్చ‌ తెలుగు హీరోయిన్లు క్రమక్రమంగా కనుమరుగు అయిపోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత శ్రీలీల రూపంలో ఒక తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న పరిస్థితి. 1980వ దశలో ఎంతోమంది తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ఆ తరం హీరోయిన్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అగ్రతారగా వెలిగింది జయప్రద. జయప్రద స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి. టాలీవుడ్ లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది.

తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కూడా విజయం సాధించారు. అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా జయప్రద పారితోషకం అందుకునేది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీ అయిన ఈ భామ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాస్టింగ్ కౌ…చ్ గురించి మాట్లాడుతూ అప్పట్లో ఇలాంటివి పెద్దగా లేవు.. టాలెంట్ ఉంటే తప్పకుండా అవకాశాలు వచ్చేవి.. అయితే ఇప్పుడు ముంబై నుంచి వస్తున్న ఎంతో మంది హీరోయిన్లు ఛాన్సుల‌ కోసం డైరెక్టర్లు, నిర్మాతల దగ్గరికి వెళుతున్నారు వాళ్లకు వాళ్లే కమిట్ అవుతున్నారు.. ఈ కారణంగానే కాస్టింగ్ కౌ…అనే పదం పుట్టుకొచ్చింద‌ని తెలిపారు.

ఇలాంటివి తగ్గాలంటే ముందు అమ్మాయిల్లో మార్పు రావాలని జయప్రద సూచించింది. అయితే ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చు అని.. అవకాశాల కోసం ఎవరూ లొంగిపోకూడదు.. అది పెద్ద తప్పు మనకున్న టాలెంట్‌ నమ్ముకుని పనిచేస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా ఛాన్సులు వస్తాయి.. నేను నా కెరియర్ లో ఇలాంటి చేదు అనుభవాలు ఎప్పుడూ ఎదుర్కోలేదని జయప్రద చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జయప్రద కాస్టింగ్ కౌ..చ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news