Moviesరామ్ ' డ‌బుల్ ఇస్మార్ట్ ' కోసం సంజ‌య్‌ద‌త్ రోజు రెమ్యున‌రేష‌న్...

రామ్ ‘ డ‌బుల్ ఇస్మార్ట్ ‘ కోసం సంజ‌య్‌ద‌త్ రోజు రెమ్యున‌రేష‌న్ అన్ని ల‌క్ష‌లా… వామ్మో…!

పూరి జగన్నాథ్ కెరీర్ కు రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అదిరిపోయే కం బ్యాక్‌ అని చెప్పాలి. ఈ సినిమాతో వరుస ప్లాపుల్లో ఉన్న పూరీతో పాటు అటు రామ్ కి కూడా సరైన హిట్ దక్కింది. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ వ‌రుస ప్లాపుల్లో పడ్డారు. ఈ క్రమంలోనే లైగర్ లాంటి భయంకరమైన డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు మళ్లీ రామ్ తో సినిమా చేస్తున్నాడు. డబుల్ స్మార్ట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కేజీఎఫ్ సినిమాల తర్వాత సంజయ్ దత్ సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం సంజయ్ దత్ 60 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంజయ్ దత్ కు ఏకంగా రు. 15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ముడుతోందట. సినిమాలో సంజయ్ దత్ పూర్తి నిడివి పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే 60 రోజులు కాల్ షీట్లకు రు. 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటే రోజుకు 25 లక్షల రెమ్యూనరేషన్ అన్నమాట. ఇది నిజంగా మామూలు రెమ్యూనరేషన్ కాదని చెప్పాలి.

సంజయ్ దత్ ఎంట్రీతో డబుల్ ఇస్మార్ట్ సినిమాకు భారీ పాన్ ఇండియా క్రేజ్ వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల ముంబైలో పూర్తిచేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ఫారిన్ లొకేషన్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ మరియు చార్మికౌర్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఏది ఏమైనా అటు రామ్ ఇటు పూరి ఇద్దరూ డబుల్ ఇస్మార్ట్ తో ఇస్మార్ట్ శంకర్ మ్యూజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news