Moviesఅనుష్క చేసిన ప‌నికి ప్ర‌భాస్ న‌వ్వు ఆపుకోలేక‌పోయాడా… వెంట‌నే రిప్లే ఇచ్చాడుగా…!

అనుష్క చేసిన ప‌నికి ప్ర‌భాస్ న‌వ్వు ఆపుకోలేక‌పోయాడా… వెంట‌నే రిప్లే ఇచ్చాడుగా…!

లేడీ సూపర్ స్టార్ అనుష్క – యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పకే ప‌లుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లు మొదలుపెట్టారు నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.

పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి ఎలాంటి ? పరిస్థితిలను ఎదుర్కొన్నాడు.. అలాగే పెళ్లి వద్దు.. పిల్లలు మాత్రమే కావాలన్న హీరోయిన్ తో హీరో ఎలా ? కష్టపడ్డాడు అనే కథను చాలా వినోదాత్మకంగా చూపించారు. ట్రైలర్ కు అయితే పాజిటివ్ బ‌జ్‌ వస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ పై అనుష్కకు బెస్ట్ ఫ్రెండ్ అయిన‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు.

ప్రభాస్ – అనుష్క ఎంత మంచి స్నేహితులు తెలిసిందే. అందులోను ఈ సినిమా నిర్మించింది ప్రభాస్ అన్న ప్రమోద్ కావడంతో.. సినిమా ట్రైలర్ను ప్రభాస్ వెంటనే చూసి తన రియాక్షన్ తెలిపాడు. ప్రభాస్ ట్రైలర్ పై ఇచ్చిన రివ్యూను యూవీ క్రియేషన్స్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ ఇలా కామెంట్ చేశాడు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ చూసినంత సేపు నవ్వు ఆపుకోలేకపోయాను.. స్వీటీ – నవీన్ వీరిద్దరూ అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ అని కామెంట్ చేశాడు. ప్రభాస్ కామెంట్స్‌పై యూవీ క్రియేషన్స్ స్పందిస్తూ థాంక్యూ ప్రభాస్ గారు అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్ లో వైరల్ గా మారింది. ఏది ఏమైనా మూడున్నర సంవత్సరాల తర్వాత థియేటర్లలోకి వస్తున్న అనుష్కకు ఈ సినిమా ఎలాంటి ? హిట్ ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news