Moviesఒకే ఫ్రేమ్ లో జూ.ఎన్టీఆర్-మోక్షజ్ఞ.. నందమూరి అభిమానులకు పెద్ద పండగలాంటి న్యూస్...

ఒకే ఫ్రేమ్ లో జూ.ఎన్టీఆర్-మోక్షజ్ఞ.. నందమూరి అభిమానులకు పెద్ద పండగలాంటి న్యూస్ ఇది..!!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ – నందమూరి కళ్యాణ్ రామ్ – నందమూరి తారక రామారావు – మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక . రీసెంట్గా ఓ ఫంక్షన్ లో ఆ కోరిక తీరిపోయింది .

నందమూరి కుటుంబంలో పెళ్లి సందడి జరిగింది . దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడు హర్ష వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు . తమ సోదరి కొడుకు పెళ్లి వేడుక కావడంతో జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ అన్ని తామై పెళ్లి వేడుకను ముందుండి నడిపించారు . ఈ క్రమంలోనే ఈ పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నందమూరి బాలకృష్ణ .

ఆయనతో పాటు ఆయన కొడుకు మోక్షజ్ఞ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు . చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి . ఇదే చోట అరుదైన దృశ్యం చోటుచేసుకుంది . ఈ జనరేషన్ నందమూరి సోదరులు ఒకే ఫ్రేమ్లో కనిపించారు . ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ – బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఒకే దగ్గర చేరి ఫోటోకు ఫోజులు ఇవ్వడం అభిమానులకు మరీ మరీ నచ్చేసింది . ప్రజెంట్ ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . గత కొంతకాలంగా బాలకృష్ణ – ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి . ఈ ఫోటోతో ఆ వార్తలకు చెక్ పెట్టిన్నత్లు అయింది . మొత్తానికి అభిమానులకి ఈ ఫోటో తెగ నచ్చేసి ట్రెండ్ చేసేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news