Moviesబాల‌య్య‌తో ' జైల‌ర్ ' డైరెక్ట‌ర్‌ నెల్స‌న్ సినిమా ఫిక్స్‌... అదే...

బాల‌య్య‌తో ‘ జైల‌ర్ ‘ డైరెక్ట‌ర్‌ నెల్స‌న్ సినిమా ఫిక్స్‌… అదే నా కోరిక అన్న డైరెక్ట‌ర్ నెల్స‌న్‌..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలో రజనీకాంత్ రిటైర్‌ అయిన జైలర్గా నటించాడు. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది.

తొలిరోజు సాయంత్రానికే సినిమా అన్నిచోట్ల పికప్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ తన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. అసలు జైలర్ సినిమా కథ రాసుకొనేట‌ప్పుడు కీరోల్‌ కోసం నందమూరి నట‌సింహ బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నాడట. తెరపై రజనీకాంత్ – బాలయ్య సార్ ఒకేసారి కనిపిస్తే సినిమాలో జోష్ వేరేగా ఉంటుందని.. అందుకే ఈ సినిమాను మల్టీస్టారర్ గా తీయాలన్నా తీయాలని అనుకున్నానని నెల్సన్ చెప్పాడు.

అయితే ఆ క్యారెక్టర్ ని బాలకృష్ణ సార్‌కు అనుగుణంగా డిజైన్ చేయలేకపోయానని.. అందుకే ఆయనను అప్రోచ్ కూడా కాలేదని.. ఆయనను కలిసి ఉంటే ఎస్ అనేవారు లేదో తర్వాత సంగతి అంటూ చెప్పాడు. ఇక సినిమాలో ప్రత్యేక ఆకర్షణ కోసం స్టార్ హీరోలు మోహన్‌లాల్ – శివరాజ్ కుమార్ ను సెలెక్ట్ చేశానని నెల్స‌న్‌ చెప్పాడు.

వీళ్ళు జైలర్‌ సినిమాలో నటించడంతో సినిమాకు చాలా హెల్ప్ అయిందని కూడా నెల్సన్ చెప్పాడు. అలాగే భవిష్యత్తులో బాలకృష్ణ సార్ తో సినిమా చేస్తానేమో అంటూ కూడా నెల్సన్ తన మనసులో కోరిక వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జైలర్ సినిమాలో బాలకృష్ణ కూడా నటించి ఉంటే సినిమా ఒక రేంజ్ లో ఉండేది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news