Moviesవేశ్య‌గా ముద్ర‌ప‌డిన ఆమెను హీరోయిన్‌ను చేసిన ఎన్టీఆర్‌... ఆమె ఎవ‌రంటే..!

వేశ్య‌గా ముద్ర‌ప‌డిన ఆమెను హీరోయిన్‌ను చేసిన ఎన్టీఆర్‌… ఆమె ఎవ‌రంటే..!

సినిమాల్లో ఎంత అగ్ర‌తార‌లైన‌ప్ప‌టికీ.. కొన్నికొన్ని నిక్ నేమ్స్ మాత్రం అలానే ఉండిపోతాయి. ఇలాంటి వారిలో ప్ర‌ముఖ న‌ర్త‌కిగానే కాకుండా.. హీరోయిన్‌గా(కొన్ని సినిమాలు), క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అనేక పాత్రలు పోషించారు. అయితే.. రాజ‌సులోచ‌న అస‌లు పేరు రాజ‌లోచ‌న‌. ఆమె త‌ల్లిదండ్రుల‌కు లేక లేక పుట్టిన ఏకైక బిడ్డ‌. దీంతో ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో రాజ అనే ప‌దం గౌర‌వంగా ఉండ‌డంతో దీనిని పేరులో చేర్చి.. రాజ‌లోచ‌న అని పెట్టారు.

కానీ, స్కూల్లో జాయిన్ చేసే స‌మ‌యంలో ఆమె పేరును త‌ప్పుగా అర్ధం చేసుకున్నారో.. ఏమోతెలియ‌దు కానీ.. రాజ‌సులోచ‌న‌గా మార్చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె రాజ‌సులోచ‌న‌గా మారిపోయింది. ఇక‌, ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. ఒకే కుమార్తె కావ‌డంతో త‌ల్లిదండ్రులు బాగానే ప్రోత్స‌హించారు. ఇలా.. సినిమాల్లోకి వ‌చ్చిన ఆమెకు తొలిపాత్రే.. వేశ్య పాత్ర‌ద‌క్కింది. తండ్రికి ఇష్టం లేక‌పోయినా.. త‌ల్లి ప్రోత్సాహంతో చేశారు.

ఇది.. త‌ర్వాత కాలంలో వ‌రుస‌గా వేశ్య‌పాత్ర‌లు చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇవి త‌ప్ప ఇంకేమీ రావా? అనే ప్ర‌శ్న రాజ‌సులోచ‌న‌ను వెంటాడింది. అయినా.. స‌ర్దుకుపోయారు. దీంతో ఎక్క‌డ ఎవ‌రు క‌లిసినా.. మీరు ఆ సినిమాలో వేశ్య పాత్ర‌లో జీవించారు! అంటూ చెప్పేవారు. అలా ఆమె అంటే ఓ వేశ్య పాత్ర‌లు మాత్ర‌మే వేసే హీరోయిన్ అన్న ముద్ర ప‌డిపోయింది. ఇది చాలా ఇబ్బందిగా ఉండేది.

అయినా.. స‌ర్దు కుపోయారు. త‌ర్వాత వ్యాంపు పాత్ర‌ల్లోన‌టించారు. ఇలా.. కొన్నాళ్ల‌కు బందిపోటు సినిమాతో అన్న‌గారు హీరోయిన్ చాన్స్ ఇచ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె హీరోయిన్‌గా నాలుగు సినిమాలు చేశారు. త‌ర్వాత క్యారెక్ట‌ర్ పాత్ర‌లు వేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news