Newsత‌మ‌న్నా సెంటిమెంటే చిరంజీవిని ముంచేసిందా... వాళ్లు వ‌ద్ద‌ని చెప్పినా చిరు విన‌లేదా...!

త‌మ‌న్నా సెంటిమెంటే చిరంజీవిని ముంచేసిందా… వాళ్లు వ‌ద్ద‌ని చెప్పినా చిరు విన‌లేదా…!

సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లకు సక్సెస్ రేటు ఎంతో కీలకం. ఇక్కడ సక్సెస్ ఉన్న వాళ్ళదే రాజ్యం. సక్సెస్ లేనివాళ్లు ఆటోమేటిక్‌గా రేసులో వెనుకబడిపోతూ ఉంటారు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్‌గా పాపులర్ అయిన హీరోయిన్లు పూజహెగ్డే – కృతిశెట్టి ఇప్పుడు ఐరన్ లెగ్‌ హీరోయిన్గా మారిపోయారు. ఇప్పుడు అంతా శ్రీలీల హవా నడుస్తోంది. ఇక 17 ఏళ్ల క్రితం మంచు మనోజ్ కు జోడిగా శ్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది మిల్కీ బ్యూటీ తమన్నా.

తమన్నా తన కెరీర్లో చాలా సినిమాలలో నటించింది. అలాగే స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. తాజాగా ఒక్క రోజు గ్యాప్‌లో ఆమె ఇద్దరు స్టార్ హీరోల‌కు జోడీగా నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడిగా జైలర్ – చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలలో ఆమె నటించింది. అయితే ఈ రెండు సినిమాలలో ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

ఇక స్టార్ హీరోలకు తమన్నా పెద్దగా కలిసి రాలేదు. బన్నీకి జోడిగా బద్రీనాథ్ – ఎన్టీఆర్‌కు జోడిగా ఊసరవెల్లి – ప్రభాస్ రెబల్ – మహేష్ బాబు ఆగడు – పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు – చిరంజీవితో సైరా, భోళా శంకర్ – గోపీచంద్ తో సీటిమార్ – కళ్యాణ్ రామ్ తో నా నువ్వే – నితిన్‌తో మ్యాస్ట్రో – రామ్‌తో ఎందుకంటే ప్రేమంట‌ సినిమాలు చేస్తే అవన్నీ డిజాస్టర్ అయ్యాయి.

ఇలా స్టార్ హీరోలకు ఆమె ఏమాత్రం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాలో తమన్నాను హీరోయిన్గా వద్దని కొందరు ఇండస్ట్రీ జనాల సూచించినా చిరు వాళ్ళ మాట పట్టించుకోకుండా ఆమెని హీరోయిన్గా పెట్టారు. చిరు కావాల‌నే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌మ‌న్నాను హీరోయిన్ గా తీసుకున్నార‌ట‌. చివరకు ఆ సెంటిమెంట్ నిజం అయి భోళా శంకర్ డిజాస్టర్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news