Moviesచరిత్ర తిరగ రాసిన బన్నీ..ఉత్తమనటుడుగా పుష్ప రాజ్ కు జాతీయ అవార్డ్.....

చరిత్ర తిరగ రాసిన బన్నీ..ఉత్తమనటుడుగా పుష్ప రాజ్ కు జాతీయ అవార్డ్.. ఫ్యాన్స్ సంబరాలు ..!!

సినీ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్ట్ నిన్న రిలీజ్ అయింది . 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు. ఐకాన్ స్టార్ అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప-ది రైజ్”లో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

ఈ క్రమంలోనే ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా ఏకంగా తెలుగు సినిమాలకు పది అవార్డులు లభించాయి. ఇది ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది ఇదే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు లభించింది. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.

బన్నీ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన సినిమా పుష్ప ది రైజ్ పార్ట్ వన్ . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దులిపేసింది. ఈ సినిమాలో బన్ని నటన చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అంతేకాదు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి పాత్ర పోషించలేదు బన్నీ . అందుకే ఆనాడు ఆయన పడిన కష్టానికి ఫలితం గా ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. అల్లు అర్జున్ కు స్పెషల్ తెలుగు లైవ్స్ తరఫున శుభాకాంక్షలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news