Movies‘బేబి’ డైరక్టర్ కు హీరో విశ్వక్‌సేన్‌ గూబ గుయ్యమనే కౌంటర్.. అంత...

‘బేబి’ డైరక్టర్ కు హీరో విశ్వక్‌సేన్‌ గూబ గుయ్యమనే కౌంటర్.. అంత మాట అనేసాడు ఏంట్రా బాబు..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే సోషల్ మీడియా ద్వారానే చెప్పుకొస్తూ ఓపెన్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు నేటి కాలం స్టార్ సెలబ్రిటీస్ . కేవలం సినిమా హీరోలే కాదు డైరెక్టర్స్ – హీరోయిన్స్ -క్యారెక్టర్ ఆర్టిస్టులు తమపై ఏదైనా నెగటివ్ ప్రచారం జరిగిన తమ గురించి నెగటివ్ గా మాట్లాడిన సోషల్ మీడియా ద్వారా ఆన్సర్ ఇస్తూ ఇచ్చి పడేస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ కూడా అలాగే చేశాడు అంటున్నారు. జనాలు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విశ్వక్సేన్ . ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్నారు . బడా హీరో సినిమాలలో కూడా అవకాశం అందుకుంటున్నాడు.

ఇలాంటి టైంలోనే విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మొదటి నుంచి విశ్వక్ సేన్ అంటే కాంట్రవర్షియల్ ఎక్కువగా పట్టించుకుంటాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . రీసెంట్గా బేబీ సినిమా డైరెక్టర్ కి పరోక్షంగా కౌంటర్ వేశాడు అన్న కామెంట్స్ మరింత రేంజ్ లో వైరల్ గా మారాయి. అసలు ఏమైందంటే.. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా “నేను ఓ కథ ను హీరో వద్దకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ..ఆ హీరో కథ వినకుండానే నన్ను రిజెక్ట్ చేశాడని ..ఆ టైంలో చాలా బాధేసింది” అని చెప్పుకొచ్చాడు .

అయితే ఆయన హీరో పేరు మాత్రం వివరించలేరు. కానీ రీసెంట్గా విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ ప్రకారం ..ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ అర్థమవుతుంది . విశ్వక్సేన్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశాడు. ” నో అంటే నోనే అది మగాడికి కూడా వర్తిస్తుంది . కాబట్టి కూల్ గా ఉంచుకుందాం ..అరవడం మానుకుని.. మనమందరం ఇక్కడ శాంతియుత వాతావరణం లోనే ఉన్నాము కాబట్టి మనస్శాంతి విశ్రాంతి తీసుకోండి “అంటూ వ్యంగ్యంగా కౌంటర్ వేస్తూనే చెప్పాలనుకున్నది చెప్పేశాడు. . అయితే సాయి రాజేష్ నో అంటే నో అంతే అక్కడితో వదిలేయాలి అంటూ కౌంటర్ వేశాడని జనాలు చెప్పుకుంటున్నారు దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది . అంతే కాదు ఒక్క మాటతో విశ్వక్సేన్ ఆ డైరెక్టర్ కి గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చాడు అంటూ విశ్వక్సేన్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు, మొత్తానికి విశ్వక్సేన్ మరో వివాదంలో వేలు పెట్టి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news