Movies"తమన్నా తో డేటింగ్ అందుకే"..సిగ్గుపడకుండా ఉన్న ఫీలింగ్ ని బయట పెట్టిన...

“తమన్నా తో డేటింగ్ అందుకే”..సిగ్గుపడకుండా ఉన్న ఫీలింగ్ ని బయట పెట్టిన విజయ్ వర్మ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . నిన్న మొన్నటి వరకు గ్లామర్ రోల్స్ లో కనిపించిన సరే హద్దులు ఏ మాత్రం మీరని తమన్నా రీసెంట్గా చేసిన జీకర్దా వెబ్ సిరీస్ లో ఏకంగా టాప్ తీసేసి మరి శృంగార సన్నివేశాల్లో నటించింది .ఆ తర్వాత వచ్చిన లస్ట్ స్టోరీస్ లో కనిపించడంతో తమన్నా పేరుని ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

కాగా ఇలాంటి క్రమంలోనే తమన్నా – విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానని డేటింగ్ చేస్తున్నానని ఓపెన్ గా చెప్పుకు రావడం మరో సంచలనంగా మారింది. కాగ రీసెంట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సైతం తమన్నాని ఎందుకు ప్రేమించాడో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తమన్న పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి . విజయవర్మ మాట్లాడుతూ ..”ఎంతోమంది అమ్మాయిలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను.. చాలా మంచి అమ్మాయిలు కూడా నాకు పరిచయమయ్యారు. అయితే వారిని చూసినప్పుడు రాని ఫీలింగ్ తమన్నాను చూడగానే వచ్చింది”.

” ఈ అమ్మాయి నాది అన్న ఫీలింగ్ కలిగింది. తమన్నా చాలా మంచిది .. ఎలాంటి పరిస్థితి అయినా హ్యాండిల్ చేయగలరు మరి ముఖ్యంగా ఇండిపెండెంట్గా నిలవాలి అనుకుంటుంది . అలాంటి ఓ అమ్మాయి నా జీవితంలోకి రావడం నిజంగా హ్యాపీగా ఉంది . నేను తమన్నాతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటానో మాటల్లో చెప్పలేను . అప్పుడే నాకు అర్థమైంది నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని ..ఆమె లేకుండా అసలు బ్రతకలేనని కూడా అర్థమైంది” అంటూ చాలా ఎమోషనల్ గా కామెంట్ చేశారు .దీంతో సోషల్ మీడియాలో విజయ్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news