Moviesప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా.. డార్లింగ్ ఫ్యాన్స్...

ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా.. డార్లింగ్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనకు బాగా తెలిసిందే. నిజానికి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సాహో -రాధేశ్యామ్- ఆది పురుష్ డిజాస్టర్లుగా మారాయి . అయినా సరే ప్రభాస్ క్రేజ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. కాగా ప్రభాస్ హిట్ కొట్టడం ఇప్పుడు కెరియర్లో చాలా ఇంపార్టెంట్. కచ్చితంగా ఆయన నెక్స్ట్ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయని నమ్మకం ఉంది.

ప్రాజెక్ట్ క్, సలార్..ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసేస్తాయి . అయితే ఆ తర్వాత సినిమాలో పరిస్థితి ఏంటి..? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మారుతితో చేయబోయే సినిమా అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు . ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసినట్లు తెలుస్తుంది . రాజా డీలక్స్ సినిమా అయిపోగానే సందీప్ రెడ్డి వంగాతో సినిమాను తెరకెక్కించే ముందే మధ్యలో మరో సినిమాను చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట .

ఈ క్రమంలోనే సీతారామం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఆయనతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు అంటూ తెలుస్తుంది. ఫుల్ క్లాసిక్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కిబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టిని తీసుకోవాలని తెగ ట్రై చేస్తున్నారట హను రాఘవపూడి. అయితే అనుష్క మాత్రం ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది, ఒకవేళ నిజంగా ఇది నిజమైతే ప్రభాస్ అనుష్క ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా అభిమానులు వాళ్ల నుండి ఎలాంటి ప్రేమ కోరుకుంటున్నారో అదే దక్కుతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news